ETV Bharat / state

చెరువుల కబ్జాతో ముప్పే - హైకోర్టుకు న్యాయమూర్తి లేఖ - స్వీకరించిన న్యాయస్థానం - Telangana HC on Pond Encroachments

Telangana High Court on Pond Encroachments : నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు శీర్షికతో ప్రచురితమైన కథనంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఇ.వి. వేణుగోపాల్​ స్పందించారు. చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకుపోతున్నాయని వాటిని పరిరక్షించుకోవాలని సూచిస్తూ ఓ లేఖను హైకోర్టుకు రాశారు. ఈ లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది.

Telangana High Court on Pond Encroachments

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 2:11 PM IST

Telangana High Court on Pond Encroachments : చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని, వాటిలోని జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్​ ఇ.వి. వేణుగోపాల్​ హైకోర్టు(Telangana High Court)కు లేఖ రాశారు. చెరువుల్లో నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అభివృద్ధి పేరుతో అక్రమణలు పెరిగి చెరువుల్లో నిర్మాణాలు వెలుస్తుండటం పర్యావరణ సమతుల్యతకు ప్రమాదమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా తీసుకుని స్పందించాల్సిన అవసరం ఏంతైనా ఉందని పేర్కొన్నారు.

ఈనాడులో మార్చి 21న ప్రచురితమైన నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విల్లాలు శీర్షికతో ప్రచురితమైన కథనంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఇ.వి.వేణుగోపాల్​ స్పందించి ఈ లేఖను రాశారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్​చెరు, నర్సాపూర్​, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 90కి పైగా చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు ఈనాడులో కథనం ప్రచురితమైంది. పటాన్​చెరు నియోజకవర్గంలోని అమీన్​పూర్​, పటాన్​చెరు, జిన్నారం, ఆర్​.సీ.పురం మండలాల్లో 69 చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురైనట్లు వెలుగులోకి తెచ్చింది. అలాగే సంగారెడ్డి నియోజవర్గంలోని సంగారెడ్డి, కంది మండలాల్లోనూ ఈ ఆక్రమణలు జరిగాయి. నర్సాపూర్​ నియోజకవర్గంలోని హత్నూర మండలాల్లో 20పైగా చెరువులు ఆక్రమణలకు గురయ్యాయి.

చెరువుల్లో మట్టి నింపి నిర్మాణాలు : ఈ నియోజకవర్గ ప్రాంతాల్లోని కొన్ని చోట్ల చెరువుల్లో మట్టి నింపి ఏకంగా 14 అంస్తులతో భవనాలు నిర్మించారు. అమీన్​ పూర్​ మండలంలోని ఉప్పరవానికుంటలో మొత్తం 6.11 ఎకరాల మేరు ఆక్రమణలకు గురైంది. ఈ సమస్యకు ప్రధాన కారణం పోలీసుల, నీటి పారుదల, రెవెన్యూ, మున్సిపల్​ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా నీటి వనరులను ఆక్రమించుకుంటున్నారని లేఖలో రాశారు. ఈ అంశాలపై ప్రచురితమైన కథనంపై న్యాయమూర్తి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరో తరగతి విద్యార్థిని లేఖకు స్పందించిన హైకోర్టు - బార్​ & రెస్టారెంట్​పై ప్రభుత్వానికి నోటీసులు

ప్రస్తుత ఆర్థికాభివృద్ధి తీరు, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతున్నాయని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. అక్రమార్కులు చట్టవిరుద్ధంగా చెరువులను కబ్జా చేసి నిర్మాణాలు చేస్తుండటం వల్ల ప్రజాజీవనం స్తంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చెరువులు, నాలాలు, వ్యవసాయ పొలాల్లో నిర్మాణాల వల్ల సహజ సిద్ధమైన నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి నివాస ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని ఆందోళన చెందారు.

Environmental Problems in Telangana : ఇలా వీటన్నింటిని ఆక్రమణలవల్లనే(Ponds Capture in Hyderabad) హైదరాబాద్​ సహా దేశంలోని పలు నగరాలను వరదలు ముంచుతున్నాయని న్యాయమూర్తి వివరించారు. వీటితో పాటు జనాభా నిష్పత్తికి తగ్గట్లుగా చెట్లు కూడా ఉండటం లేదన్నారు. దీనివల్ల స్వచ్ఛమైన గాలి సమస్య కూడా ఉందని తెలిపారు. పర్యావరణ సమతౌల్యం దెబ్బతినడం వల్ల వర్షాభావం లేదా అధిక వర్షపాతం వంటివి సంభవిస్తాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చట్ట విరుద్ధంగా నీటి వనరుల్లో అక్రమంగా సాగుతున్న వాటిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏంతైనా ఉందని ప్రధాన న్యాయమూర్తి దీన్ని సుమోటోగా తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి : ఈ మేరకు న్యాయమూర్తి రాసిన లేఖను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణనలోకి తీసుకుని ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల, పురపాలక, రెవెన్యూ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, హైదరాబాద్​, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు, హెచ్​ఎండీఏ లేక్​ ప్రొటెక్షన్​ కమిటీని చేర్చింది. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టనుంది.

ఆ 38 ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడంపై వివరణ ఇవ్వండి - ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ఆ కూరగాయలు, ఆకు కూరల సాగును అడ్డుకోండి - రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.