ETV Bharat / state

హీరో రాజ్‌తరుణ్‌కు ఊరట - షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు - Anticipatory Bail to Raj Tarun

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 8, 2024, 5:58 PM IST

HC Granted Bail To Raj Tarun : హీరో రాజ్‌తరుణ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్​ను మంజూరు చేసింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

Anticipatory Bail to Raj Tarun
Anticipatory Bail to Raj Tarun (ETV Bharat)

HC Granted Bail To Raj Tarun : యువ సినీ హీరో రాజ్‌తరుణ్‌కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. అతడికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనని మోసం చేశాడంటూ కొద్ది రోజుల క్రితం లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై నార్సింగి పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసిన సంగతి విధితమే. తామిద్దరం కొన్నేళ్ల పాటు సహజీవనం చేశామని, ఆ తర్వాత రహస్య వివాహం చేసుకున్నామని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు వేరే మహిళతో సన్నిహితంగా ఉంటూ తనని పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేసింది.

షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు : లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజ్‌తరుణ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, విచారణకు హాజరు కావాల్సిందిగా అతడికి నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే రాజ్‌ తరుణ్‌ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్(యాంటిసిపేటరీ బెయిల్) మంజూరు చేయాలని కోరారు. దీంతో న్యాయస్థానం రాజ్​తరుణ్​కు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే రూ.20వేలతో రెండు పూచికత్తులు సమర్పించాలని అతడిని ఆదేశించింది.

'నన్ను కొట్టాడు' - 'లేదు నాపైనే దాడి చేసింది' - లావణ్య, శేఖర్ బాషా పరస్పర ఫిర్యాదులు - Hero Raj Tarun Lavanya Case

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.