Telangana High Court Dismissed KCR Petition : విద్యుత్ కమిషన్‌ను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కోట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు చేసింది.
ఐతే, విద్యుత్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఇటీవల కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. నిబంధనల మేరకే విద్యుత్ కమిషన్ పని చేస్తోందన్న అడ్వొకేట్ జనరల్ కేసీఆర్ వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని వాదించారు. కేసీ ఆర్తరపు న్యాయవాదుల వాదనతో విభేదించిన హైకోర్టు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.