ETV Bharat / state

గ్రూప్-2 హాల్​టికెట్లు - ఇలా డౌన్​లోడ్ చేసుకోండి - GROUP2 HALL TICKETS RELEASED

గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్ - హాల్​టికెట్లు విడుదల

TG Group2  Hall Tickets Released
TG Group2 Hall Tickets Released (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2024, 4:45 PM IST

TG Group-2 Hall Tickets Released : తెలంగాణలో గ్రూప్‌-2 పరీక్షల హాల్‌ టికెట్లు విడుదలయ్యాయి. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో ఈ ఎగ్జామ్స్​ జరగనున్నాయి. ఇందుకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇవాళ టీజీపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్​కు అందుబాటులో ఉంచింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

TGPSC Group2 Hall Ticket 2024 : ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1:30 గంటల నుంచి 2:30 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 783 గ్రూప్‌- 2 పోస్టులను భర్తీ చేసేందుకు 2022లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.51లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

TG Group-2 Hall Tickets Released
జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే (ETV Bharat)

పరీక్షల షెడ్యూల్ ఇలా :

  • జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఎబిలిటీస్‌ - పేపర్‌-1
  • హిస్టరీ, పాలిటీ, సొసైటీ - పేపర్‌-2
  • ఎకానమీ, డెవలప్‌మెంట్‌ - పేపర్‌-3
  • తెలంగాణ ఉద్యమం, ఏర్పాటు - పేపర్‌-4

గ్రూప్​-2 హాల్​టికెట్ల డౌన్‌లోడ్‌ కోసం అభ్యర్థులు ఈ లింక్​ను క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే టీజీపీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ వివరాలతో పాటు అక్కడ ఉన్న క్యాప్చా కోడ్‌ కనిపిస్తుంది. వాటిని ఎంటర్‌ చేస్తే హాల్​టికెట్ డౌన్​లోడ్ అవుతుంది. మరోవైపు హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించేందుకు వీలుగా జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లను అధికారులు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఉదయం 10:30గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు (పని దినాల్లో మాత్రమే) ఈ నంబర్లను సంప్రదించాలని చెప్పారు. ఇంకా ఏదైనా సమాచారం కోసం టీజీపీఎస్సీ హెల్ప్‌లైన్‌ నంబర్లు 040-23542185/22445566/ 23542187కు ఫోన్ చేయాలని వివరించారు. లేదా helpdesk@tspsc.gov.inకు ఈ-మెయిల్‌ చేయవచ్చని అధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా హెల్ప్‌లైన్‌ నంబర్లు ఇవే :

ఫిబ్రవరిలో గ్రూప్​ -1 ఫలితాలు విడుదల

గ్రూప్​-2 పరీక్షల షెడ్యూల్​ విడుదల - అరగంట ముందే పరీక్ష కేంద్రానికి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.