ETV Bharat / state

ఫారిన్ వెళ్లి చదువుకునే వారికి పండగే - స్కాలర్​షిప్స్ సంఖ్య పెంచనున్న ప్రభుత్వం! - OVERSEAS EDUCATION SCHOLARSHIPS

తెలంగాణలో విదేశీ విద్య ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు భారీ ఊరట - స్కాలర్‌షిప్స్​ సంఖ్యను పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు

Overseas_Education_Scholarships
Overseas_Education_Scholarships (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 8, 2024, 6:58 PM IST

Overseas Education Scholarships in Telangana: విదేశీ విద్య ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు త్వరలోనే భారీ ఊరట కలగనుంది. తెలంగాణలో ఈ పథకం కింద అందిస్తున్న స్కాలర్‌షిప్స్​ సంఖ్యను పెంచాలని ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అందిస్తున్న వాటికి దాదాపు రెండింతలకు పైగా చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ సంక్షేమ శాఖలు ప్రభుత్వానికి తమ ప్రతిపాదనలను పంపించినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ వర్గాల్లో ప్రతి సంవత్సరం 1,110 మంది విద్యార్థులకు మాత్రమే విదేశీ విద్య ఉపకార వేతనాలు అందుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలిపితే ఆ సంఖ్య 2,300 చేరే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు ఏటా స్ప్రింగ్‌ సీజన్‌కు మార్చిలో, ఫాల్‌ సీజన్‌కు అక్టోబరులో అప్లికేషన్లను స్వీకరించి అభ్యర్థులను ఎంపిక చేస్తున్నాయి. లబ్ధిదారులకు 2 విడతలల్లో (ఏడాదికి రూ.10 లక్షలు) రూ.20 లక్షల స్కాలర్​షిప్​, విమాన ఛార్జీలు, వీసా ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేస్తోంది.

అప్పులు చేసి వీసాలు పొంది: గతంలో స్కాలర్‌షిప్‌ మంజూరయ్యాక విద్యార్థులు వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు. వివిధ కారణాలతో కొందరి వీసాలు తిరస్కరణకు గురయ్యేవి. దీంతో వీసాలు పొందిన విద్యార్థులే ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం ఉపకార వేతనం మంజూరు చేస్తుందన్న నమ్మకంతో కొందరు అప్పులు చేసి మరి వీసాలు పొంది విదేశాల్లో చదువుకోవడానికి వెళ్తున్నారు.

ఇసుక లోడ్ చేస్తుండగా ప్రమాదం - వాగులో నలుగురు యువకులు గల్లంతు

ఇక్కడ దరఖాస్తు చేసినా మంజూరు సంఖ్య తక్కువగా ఉండటంతో తీవ్రమైన ఆర్థిక కష్టాలు ఎదురవుతున్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితులను అధిగమించాలని, అర్హుల్లో అత్యధికులకు విదేశీ విద్య అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకుంది.

ఏ సంక్షేమ శాఖలో ఎంతమంది

  • ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో ప్రస్తుతం ఏటా 210 మందికి విదేశీ విద్య పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. దరఖాస్తుల సంఖ్య దాదాపు పది రెట్లకుపైగా ఉంటోంది. ఇక నుంచి లబ్ధిదారుల సంఖ్యను 500కు పెంచాలని అధికారులు ప్రతిపాదించారు.
  • ఎస్టీ సంక్షేమ శాఖలో ఏడాదికి 100 మందినే ఎంపిక చేస్తున్నారు. లబ్ధిదారులను 500కు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
  • బీసీలకు ఏడాదికి కేవలం 3వందల స్కాలర్‌షిప్‌లు మాత్రమే అందుతున్నాయి. దరఖాస్తుదారులు మాత్రం ఆరు వేలకుపైనే ఉంటున్నారు. దీంతో లబ్ధిదారుల సంఖ్యను 8వందలకు పెంచాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన తర్వాతే లబ్ధిదారుల జాబితాను ప్రకటించాలని, తద్వారా భారీ సంఖ్యలో విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని బీసీ సంక్షేమశాఖ కసరత్తు చేస్తోంది.
  • మైనార్టీల్లో అత్యధికంగా 5వందల మందికి ఉపకార వేతనాలు అందుతున్నాయి.

తండ్రి, అన్న కలిసి చంపేశారు - 24 రోజుల తరువాత ఏం జరిగిందంటే!

"గుడ్ జాబ్" పోలీసులను అభినందిస్తూ సీఎం ట్వీట్ - ఎందుకంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.