ETV Bharat / state

త్వరలోనే అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు - పూర్తిస్థాయి బడ్జెట్​ ప్రవేశపెట్టే అవకాశం - Telangana Assembly Monsoon Sessions

author img

By ETV Bharat Telangana Team

Published : Jun 13, 2024, 1:57 PM IST

TG Budget Sessions 2024 : రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమవుతోంది. వివిధ శాఖలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నారు. అలాగే విద్య, వ్యవసాయ కమిషన్‌లతోపాటు రైతు భరోసా, రైతు రుణమాఫీ, ధరణి, ఆర్‌ఓఆర్ చట్టాలు తదితర అంశాలు అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

Telangana Assembly Monsoon Sessions 2024
Telangana Assembly Monsoon Sessions 2024 (ETV Bharat)

Telangana Assembly Monsoon Sessions 2024 : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్రంతో పాటు రాష్ట్రాలు పూర్తిస్థాయి బడ్జెట్‌కు బదులు దీనికే ఆమోదం తెలిపాయి. రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ పద్దులకు మాత్రమే అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జులై వరకే ఇది అమల్లో ఉంటుంది.

కేంద్ర బడ్జెట్ ఆధారంగా కేటాయింపులు : ఆగస్టు నుంచి మార్చి వరకు అవసరమైన నిధుల కేటాయింపు కోసం పూర్తిస్థాయి బడ్జెట్‌ అమల్లోకి రావాల్సి ఉంది. దీంతో కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే సర్కార్ ఈ నెలలో పార్లమెంట్‌ సమావేశాలు నిర్వహించి పూర్తిస్థాయి పద్దును ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ మేరకు ఉంటాయో చూసుకుని, వాటి ఆధారంగా ఇక్కడ తెలంగాణ సర్కార్ పూర్తిస్థాయి పద్దుకు తుది మెరుగులు దిద్దనుంది.

రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రానున్న రోజుల్లో ప్రవేశపెట్టనున్న పథకాల అమలుకు నిధుల కేటాయింపు తదితర అంశాలపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరగనుంది. రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీకి ఎంత ఖర్చు అవుతుంది? దానికి నిధుల సమీకరణ ఎలా చేయాలనే అంశంపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు అమలవుతున్న రైతుబంధు పథకంతో అనర్హులకు కూడా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్న తెలంగాణ సర్కార్ దానిని ప్రక్షాళన చేసే దిశలో ముందుకెళ్లాలని యోచిస్తోంది.

రైతు బంధులా రూ.10,000లు కాకుండా, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15,000లు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వంలో బీడుభూములకు, వ్యవసాయేతర భూములకు, కొండలు, రహదారులకు కూడా రైతుబంధు ఇచ్చారని అధికార పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అర్హులకు మాత్రమే అందేలా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ధరణి పోర్టల్‌కు బదులుగా భూభారతిని తెస్తామని చెబుతూ వస్తున్న సర్కార్, ఇదే అంశంపై అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఆర్‌ఓఆర్ చట్టం సమర్ధత కలిగినది కాదని అభిప్రాయపడుతున్న ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో సవరించి పటిష్ఠ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.

కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగా పాలన సంస్కరణలు : కౌలు రైతులకు సైతం పంట పెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించేందుకు కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. అలాగే కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుగుణంగా పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చేందుకు సర్కార్ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. విద్య, వ్యవసాయ రంగాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం విద్యాకమిషన్, రైతు కమిషన్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

Telangana Budget Sessions 2024 : అదేవిధంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు, తెలంగాణ చిహ్నంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వర్షాకాల సమావేశాలల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌కు ఆమోదముద్ర వేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

బడ్జెట్‌పై ఆర్థికశాఖ కసరత్తు - జూన్‌ 18 నుంచి శాఖల వారీగా సన్నాహక భేటీలు - TELANGANA GOVT BUDGET 2024

శాసనసభలో 42 పేజీల శ్వేతపత్రం - తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.