Telangana Govt on Six Guarantees Today Prathidwani : ఆరు గ్యారంటీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే నాలుగు గ్యారంటీలను అమలు చేస్తున్న సర్కార్ తాజాగా మరో గ్యారంటీని అమల్లోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రోజున భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 22.30 వేల కోట్లలతో 4.30 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. పేదలు పదిమందిలో తలెత్తుకొని బతికేలా చేయడమే తమ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని వెల్లడించారు. అయితే ఇప్పటికి ఐదు గ్యారంటీలు అమల్లోకి తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆరో గ్యారంటీపైనా దృష్టి సారిస్తోంది. అయితే ఈ ఆరు గ్యారంటీల అమల్లో గత అనుభవాలు, లోపాలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎలాంటి ముందడుగు వేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి ఆటంకం లేకుండా పేదల సొంటింటి కల నెరవేరాలంటే ఏం చర్యలు తీసుకోవాలి? ఈ అంశాల అన్నింటిపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">