TS Govt Helps For Child Cancer Patient Treatment : క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. 'అరుదైన క్యాన్సర్‌తో బాధ పడుతున్న చిట్టితల్లి' అని శనివారం ఈటీవీ భారత్ తెలంగాణలో కధనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని తెలిపారు. వెంటనే ప్రభుత్వ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. ఆ చిన్నారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి సూచన మేరకు వైద్యులు వేదవల్లి కుటుంబ సభ్యులను సంప్రదించారు. ప్రభుత్వం తరఫున ఉచితంగా చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు. చిన్నారికి వచ్చిన పెద్ద కష్టానికి ప్రభుత్వం స్పందించటంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు.
Hyderabad 8 Year Girl Suffering From Cancer : హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ఉంటున్న ఎ.రఘు, మంజుల దంపతుల కుమార్తె ఎనిమిదేళ్ల వేదవల్లికి అరుదైన క్యాన్సర్ సోకిన సంగతి తెలిసిందే. పలు చికిత్సల కోసం ఇంత వరకు రూ.40 లక్షలు ఖర్చు చేసిన తల్లిదండ్రులు మరో రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. ఇప్పటికే పాప చికిత్స కోసం తమవద్ద ఉన్నదంతా ఖర్చుచేయడంతో పాటు బంధువులు, స్నేహితుల వద్ద అప్పులు తీసుకొని వైద్యం చేయించినట్లు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు. ఇక ముందు చికిత్సకు తన వద్ద ఏమీలేదని, ఎవరైన దాతలు తమ బిడ్డను ఆదుకోవాలని రఘు అర్థిస్తున్నారు.
కాళ్లు పోయాయి... కష్టాలు మిగిలాయి... ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు..
చిన్నారి పరిస్థితిని ‘ఈటీవీ భారత్' ద్వారా తెలుసుకున్న దేశ విదేశాల్లో ఉంటున్న ఎంతో మంది మానవతావాదులు స్పందించారు. తామున్నామంటూ ఆపన్న హస్తం అందించారు. వేదవల్లి తండ్రి రఘుకు ఫోన్‌చేసి చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీశారు. శనివారం సాయంత్రం వరకు వేదవల్లి వైద్య ఖర్చుల కోసం వారంతా రూ.6.5 లక్షల వరకు సాయం అందించారు.
అమెరికా నుంచి ఎన్‌ఆర్‌ఐ ఒకరు రూ.1,00,016 పంపించారు. అలాగే వీరేంద్ర నల్లపనేని, డి.సంతోష్, శ్రీకాంత్ సూరిపెద్ది రూ.50 వేల చొప్పున సాయం చేశారు. అమ్మినేని వంశీకృష్ణ రూ.36 వేలు, శేష్‌కుమార్ పర్లప రూ.25 వేలు, మురళి కొర్రపాటి, కందిబండ సుధీర్ రూ.20 వేల వంతున సాయం చేశారు. వీరితోపాటు పలువురు రూ.10 వేల చొప్పున, మరికొందరు తమకు తోచినంత ఆర్థికసాయం అందజేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన - చిన్నారి వైద్యానికి సీఎం రేవంత్ సాయం
చిన్నారి మెదడులో గడ్డ కట్టిన రక్తం - ఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపులు