ETV Bharat / state

తెలంగాణ రైతులకు శుభవార్త - రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల - 2ND PHASE CROP LOAN FUNDS RELEASED

Telangana Govt Released Crop Loan Waiver Funds : తెలంగాణ రైతులకు శుభవార్త. రెండో విడత రైతు రుణమాఫీ నిధులను మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.

telangana_govt_released_crop_loan_waiver_funds
telangana_govt_released_crop_loan_waiver_funds (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 30, 2024, 1:29 PM IST

Telangana Govt Released Second Installment Crop Loan Funds : అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. రెండో విడత రైతు రుణమాఫీ నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రెండో విడత రూ.లక్ష నుంచి లక్షన్నర వరకు రుణమాఫీ కానుంది. రెండో విడతలో 6.4 లక్షల మంది రైతులకు రూ.6,190 కోట్లు జమ చేశారు. తొలివిడతలో 11.34 లక్షల మంది రైతులకు రూ.6,035 కోట్లు విడుదల చేయగా రుణమాఫీ ద్వారా ఇప్పటివరకు 17.75 లక్షలమంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాల్లో రూ.12,225 కోట్లు ప్రభుత్వం జమ చేసింది.

ఇలాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా జరగలేదు : రైతులకు రెండోవిడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. రెండోవిడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతుల మేలు కోసం మా ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న ఆయన రైతు రుణమాఫీపై శరవేగంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు.

రెండో విడతలో 6.4 లక్షల మంది ఖాతాల్లో రూ.6,190 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చినప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేసారని గుర్తు చేసిన ఆయన వరంగల్ సభలో రాహుల్ ఇచ్చిన హామీని నిజం చేశామని చెప్పారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఇవాళ పండుగ రోజు అన్న ఆయన ఇలాంటి కార్యక్రమం గతంలో మనదేశంలో ఎక్కడా జరగలేదని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

తెలంగాణ రైతులకు శుభవార్త - రేపే రెండో విడత రుణమాఫీ నిధులు విడుదల - Second Phase Crop Loan Waiver

రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని మంత్రి తుమ్మల అన్నారు. రూ.లక్షన్నర అప్పు ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నాని తెలిపారు. ఒకే పంట కాలంలో రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్నా ఆయన ఆగస్టులో రూ.2 లక్షల్లోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తామని హమీ ఇచ్చారు. పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామన్నారు. త్వరలోనే రైతు భరోసా విధివిధానాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గతంలో కంటే భిన్నంగా రైతు భరోసా విధివిధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయిల్‌పామ్‌ పంట వేయాలని రైతులను కోరారు.

"ఐదేళ్లలో 5 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ వేయాలని కోరుతున్నాం. అనేక రాష్ట్రాలకు పామాయిల్‌ సరఫరా చేసే స్థాయికి మనం చేరాలి.రైతే రాజు అనే నినాదానికి నిజమైన అర్థం చెబుతున్నాం. మన్మోహన్‌సింగ్ హయాంలో రూ.70 వేల కోట్లు రుణమాఫీ చేశాం." - తుమ్మల నాగేశ్వర రావు, వ్యవసాయశాఖ మంత్రి

మీ 'వాట్సాప్‌'కు రుణమాఫీ మెసేజ్‌ వచ్చిందా?- క్లిక్ చేశారో ఖాతాలో డబ్బంతా మాయం - rytu runa mafi link

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.