ETV Bharat / state

తెలంగాణ ఆర్టీసీలో 3035 ఉద్యోగాలకు గ్రీన్​సిగ్నల్ - ఏ డిపార్ట్​మెంట్​లో ఎన్ని పోస్టులంటే? - TELANGANA RTC JOB NOTIFICATION 2024 - TELANGANA RTC JOB NOTIFICATION 2024

Telangana RTC Recruitment Notification : ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. 2000 డ్రైవర్‌ ఉద్యోగాలతో పాటుగా 743 శ్రామిక్‌, 198 డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.

JOBS NOTIFICATION IN RTC
JOBS NOTIFICATION IN RTC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 2, 2024, 2:03 PM IST

Updated : Jul 2, 2024, 9:41 PM IST

Telangana RTC Job Notification 2024 : ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. మొత్తం 3035 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలతో పాటు కొత్త బస్సు సర్వీసుల కొనుగోళ్లు సేవలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకొందని, కొత్త రక్తంతో ఆర్టీసీని మరింతగా బలోపేతం చేస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. త్వరలోనే ఉద్యోగాల భర్తీకి పూర్తిస్థాయి నోటిఫికేషన్లు వెలువరిస్తామని తెలిపారు.

ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పంపిన అన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 3,035 పోస్టుల్లో 2,000 డ్రైవర్‌, 743 శ్రామిక్‌, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్ ఇంజనీర్‌, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషలిస్ట్‌) కొలువులు ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.

3035 Posts in Telangana RTC : మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించడంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిందని, 100 శాతం అక్యూపెన్సి దాటిందన్నారు. దీనితో కొత్త బస్సుల కొనుగోలుపై ప్రజా ప్రతినిధుల నుంచి డిమాండ్స్ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్, మెకానిక్ ఇలా 3035 ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన సీఎం రేవంత్​, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త కొలువులతో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా బలోపేతం చేస్తామని పొన్నం పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో పెరిగిన రద్దీకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త బస్సులను సంస్థ కొనుగోలు చేస్తోందని చెప్పారు. కొత్త బస్సులకు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నట్లు వివరించారు. వీలైనంత త్వరగా 3,035 పోస్టులను భర్తీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

తెలంగాణ 'మహాలక్ష్ము'లకు బ్యాడ్​ న్యూస్​ - ఇకపై వారంతా టికెట్​ కొనాల్సిందే! - RTC Introducing New deluxe Buses

అది పూర్తిగా ఎడిటెడ్ వీడియో - ఆర్టీసీ ప్రతిష్ఠ దిగజార్చే ప్రయత్నం చేస్తే చర్యలు పక్కా : టీజీఎస్​ఆర్టీసీ ఎండీ - Bus Stunt Viral Video

Last Updated : Jul 2, 2024, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.