Telangana Intermediate Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను ఈ నెల 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మొదటి, రెండో సంవత్సర పరీక్ష ఫలితాలను అధికారులు ఒకేసారి వెల్లడించనున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,521 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే రెండు సంవత్సరాలను కలిపి 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలను రాశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసి ఎంతో పకడ్బందీగా పరీక్షలను అధికారులు నిర్వహించారు.
మార్చి 10 నుంచి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. మొత్తం 4 విడతల్లో ఈ ప్రక్రియను నిర్వహించిన అధికారులు ఏప్రిల్ 10వ తేదీన మూల్యాంకనం పూర్తి చేశారు. మార్కుల నమోదుతోపాటు ఎలాంటి టెక్నికల్ ఇబ్బందులూ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకున్న తర్వాత అధికారులు ఫలితాలను వెల్లడించనున్నారు.
తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయ్ - డేట్ ఫిక్స్! - Telangana Inter Results
అయితే ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెంకండ్ ఇయర్ రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. దానికి ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై కసరత్తు చేస్తున్నారు. ఫలితాలు విడుదల కాగానే చాలామంది సైట్ ఓపెనే చేసేసరికి సర్వర్ డౌన్ అని చూపిస్తుంది. లేదా లోడింగ్ అవుతూనే ఉంటుంది ఇలాంటివి ఏవీ రాకుండా అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు సర్వర్ హ్యాంగ్ కాకండా చర్యలు చేపట్టారు.
అన్ని ముందస్తు కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 24న ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఫలితాలు విడుదల అనంతరం వాటిని అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఎలా తెలుసుకోవాలన్న అంశాలపై కాలేజీలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇంటర్ ఫస్ట్, సెంకడ్ ఇయర్ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in లేదా www.manabadi.com వైబ్సైట్లోకి వెళ్లి తెలంగాణ ఇంటర్ రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.
పరీక్షల ఫలితాలు వెలువడ్డాక విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యామని మనస్తాపానికి గురై విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకూడదని నిపుణులు సూచించారు. ఫలితాలను చూసి తల్లిదండ్రులు పిల్లలను మందలించడం వంటివి చేయకుండా వారికి భరోసా ఇవ్వాలని చెప్పారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు తొందరపాటు చర్యలకు పాల్పడకూడదని, వారికి మళ్లీ సంప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. సప్లీ రాసి పాస్ అవ్వొచ్చని చెప్పారు.
ఇంటర్ తరువాత బెస్ట్ టాప్ 10 కెరీర్ ఆప్షన్స్ ఇవే!
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్! - Telangana Inter Results