ETV Bharat / state

పనితీరులో అట్టడుగున తెలంగాణ డిస్కంలు​ - జాతీయ విద్యుత్ ఆర్థిక సంస్థ జాబితాలో సీ గ్రేడ్

Telangana DISCOMs Rank Low in India : దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యుత్​ పంపిణీ సంస్థల పనితీరు అట్టడుగున ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జాతీయ విద్యుత్​ ఆర్థిక సంస్థ ర్యాంకులను విడుదల చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించిన రెండు డిస్కంలకు సి-గ్రేడ్​ లభించింది.

Discom Ranking in India 2023
Telangana Discoms Ranks in India
author img

By ETV Bharat Telangana Team

Published : Mar 12, 2024, 2:40 PM IST

Telangana DISCOMs Ranks Low in India : దేశవ్యాప్తంగా విద్యుత్​ పంపిణీ సంస్థ (డిస్కం)ల పని తీరుతో పోలిస్తే తెలంగాణ సంస్థల పనితీరు అట్టడుగున ఉంది. వివిధ విభాగాల్లో కనబరిచిన పనితీరు ఆధారంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఈ ర్యాంకులను జాతీయ విద్యుత్​ ఆర్థిక సంస్థ (పీఎఫ్​సీ) ఈ నెల 11న విడుదల చేసింది. ఆర్థిక సంస్థలు, బ్యాంకులు డిస్కంలకు అప్పులు ఇవ్వాలన్నా ఈ ర్యాంకులను పరిగణలోకి తీసుకుని రుణాలు ఇస్తుంటాయి. తెలంగాణలో ఉన్న రెండు సంస్థలకు సి-గ్రేడ్​ వచ్చింది. వరంగల్​ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ డిస్కంకు 46, హైదరాబాద్​ కేంద్రంగా ఉన్న దక్షిణ డిస్కంకు 44వ ర్యాంకులు లభించాయి.

DISCOMs Ranking in India 2023 : మొత్తం 53 డిస్కంల పని తీరును జాతీయ స్థాయిలో ఇవ్వగా అందులో ముంబయి, దిల్లీ, గుజరాత్​, ఒడిశా, హరియాణాకు చెందిన 14 సంస్థలకు మాత్రమే ఏ ప్లస్​ గ్రేడ్​ లభించింది. మరో 4 డిస్కంలకు ఏ గ్రేడ్, 7 బి, 13కి బి మైనస్​, 11 వాటికి సి, మిగిలిన వాటికి సి మైనస్​ ర్యాంకులు లభించాయి. తెలంగాణకన్నా వెనుకబడిన రాష్ట్రాలైన ఒడిశా, బిహార్​ వంటి రాష్ట్రాల డిస్కంలు సైతం ర్యాంకింగ్​లో ఉన్నతస్థాయిలో ఉండటం గమనార్హం. దక్షిణ డిస్కంకు 19.9, ఉత్తర డిస్కంకు 17.9 శాతం పర్సంటేజ్​ మాత్రమే వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, పథకాలకు వాడుతున్న కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో తెలంగాణ డిస్కంలకు మార్కులు తగ్గాయి. ​

పాతబాకీలు ఏమీ లేవు, విద్యుత్తు కొనుగోలుకు ఓకే అన్న కేంద్రం

ఒక యూనిట్​ విద్యుత్​ సరఫరాకు అవుతున్న సగటు వ్యయం (ఏపీఎస్​)తో పోలిస్తే ఎంత సగటు ఆదాయం (ఏఆర్​ఆర్​) వస్తుందనేది డిస్కం పనితీరును తెలుపుతుంది. దేశంలో ఏసీఎస్​, ఏఆర్​ఆర్​ల మధ్య రుపాయికి మించి లోటు ఉన్న డిస్కంలు చాలా తక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలోని దక్షిణ డిస్కంలో రుపాయి 8 పైసలు, ఉత్తర డిస్కంలో రుపాయి 19 పైసల ఆదాయం తక్కువగా వస్తుంది. దీని కారణంగా నష్టాలు పెరిగిపోతున్నాయి.

  • ఉత్తర(22.2%), దక్షిణ(17.2%) డిస్కంలలో కరెంటు సరఫరా, పంపిణీ, వాణిజ్య(ఏటీసీ) నష్టాలు అంతకు ముందు ఏడాదికన్నా పెరిగాయి.
  • కరెంటు బిల్లుల వసూలు సామర్థ్యం కేటగిరీలో 5 మార్కులుంటే ఉత్తర డిస్కంకు సున్నా లభించింది.

Amendment Electricity Act త్వరలో కరెంటు నెలకో రేటు

విభాగాల వారిగ ఇది పరిస్థితి
అంశందక్షిణ డిస్కంఉత్తర డిస్కం
విద్యుత్ కనెక్షన్లు1.09 కోట్లు65.10 లక్షలు
అందులో వ్యవసాయ బోర్లు12.73 శాతం19.75 శాతం
2022-23 నష్టాలు రూ.8,147 కోట్లు రూ.2,956 కోట్లు
చెల్లించాల్సిన బకాయిలురూ.29,398 కోట్లు రూ. 11,649 కోట్లు
రావాల్సిన బిల్లులు
వినియోగదారుల నుంచి రూ.4,199 కోట్లురూ.2,460 కోట్లు
ప్రభుత్వ కార్యాలయాల నుంచి రూ.16 వేల కోట్లు రూ.10 వేల కోట్లు

డిస్కంలకు రూ. 8,925 కోట్లు.. ఉత్తర్వులు విడుదల చేసిన ఇంధనశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.