ETV Bharat / state

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అంతర్రాష్ట్ర ఆపరేషన్ - 27 మంది సైబర్​ నేరగాళ్ల అరెస్ట్ - IPS Shikha Goyal On Cyber Crimes - IPS SHIKHA GOYAL ON CYBER CRIMES

IPS Shikha Goyal Press Meet On Cyber Arrests : దేశంలో సైబర్​ దాడులు పెరుగుతున్న క్రమంలో రాష్ట్రానికి చెందిన సైబర్​ సెక్యూరిటీ టీమ్​ అలర్ట్​ అయ్యింది. ఈ మేరకు తొలిసారి అంతర్రాష్ట్ర ఆపరేషన్​ నిర్వహించి, 27 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసింది. వారి నుంచి పెద్దమొత్తంలో నగదు సహా ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఆ వివరాలను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌ తెలిపారు.

Cyber Security Director Shikha Goyal On Cyber Crimes
IPS Shikha Goyal Press Meet On Cyber Arrests (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 1, 2024, 5:43 PM IST

Updated : Oct 1, 2024, 6:32 PM IST

Cyber Security Director Shikha Goyal On Cyber Crimes : దక్షిణ ఆసియా దేశాలు సైబర్‌ నేరాలకు హబ్‌లా మారుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్‌ హెచ్చరించారు. ఎటువంటి లింక్‌ క్లిక్‌ చేయవద్దని, ఏదైనా అనుమానం ఉంటే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. సైబర్ నేరస్తులపై పోలీసుల నిఘా పెరగడంతో సైబర్‌ నేరగాళ్లు నగరాలు వదిలి గ్రామాల నుంచి ఆపరేట్ చేస్తున్నారని ఆమె తెలిపారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మొదటిసారి అంతర్ రాష్ట్ర ఆపరేషన్ నిర్వహించిందని శిఖా గోయల్​ వెల్లడించారు. రాజస్థాన్‌ ముఠా రాష్ట్రంలో భారీగా సైబర్‌ నేరాలకు పాల్పడిందని తెలిపారు. నిరుద్యోగులు, పేదలు, ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకున్నారని అన్నారు. ఈ ఆపరేషన్​లో వివిధ రూపాల్లో ఆర్థిక నేరాలకు పాల్పడిన 27 మంది సైబర్‌ నేరగాళ్లను అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. ఈ సైబర్ కేటుగాళ్ల కోసం 20 రోజుల పాటు నాలుగు బృందాలు గాలించి పట్టుకున్నారని తెలిపారు.

తెలంగాణలో 189 కేసుల్లో రూ.9కోట్లు కాజేసిన రాజస్థాన్‌ ముఠా : నిందితులు తెలంగాణ రాష్ట్రంలో 189, దేశవ్యాప్తంగా 2,223 కేసుల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదైన 189 కేసుల్లో రూ.9 కోట్లు కాజేశారని తెలిపారు. నిందితులు 29 ఫేక్​ అకౌంట్​లు తెరిచి, వాటి ద్వారా రూ.11.01 కోట్ల సైబర్ నేరాలకు పాల్పడ్డారని శిఖా గోయల్ చెప్పారు. అదేవిధంగా నిందితుల నుంచి 31 చరవాణిలు, 37 సిమ్‌ కార్డులు, 13 ఏటీఎమ్‌ కార్డులు, 7 చెక్‌బుక్స్‌, రెండు హార్డ్​డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నామని ఆమె వివరించారు.

"ప్రజలు ఫోన్‌లకు వచ్చే అనుమానిత లింకులు తెరవద్దు. అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కొంతమంది కేటుగాళ్లు ఫేక్​ అకౌంట్​లు తెరిచి, కమిషన్ల కోసం కక్కూర్తిపడి కరెంట్ ఖాతాలు ఏవైతే యాక్టీవ్​గా ఉంటాయే వాటిని టార్గెట్​గా చేసుకొని, వారికి లింక్​లు పంపటం లేదా ట్యాక్స్​ హెచ్చరికలు చేస్తూ డబ్బులను గుంజుకోవడం జరుగుతుంది. అలాంటివాటిని నమ్మకుండా ఏవైనా స్పామ్​గా అనిపిస్తే సైబర్​ క్రైెంను సంప్రదించండి."-శిఖా గోయల్​, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్

దోపిడీ కొండంత - రాబట్టేది గోరంత - సైబర్​ మోసాల సొమ్ము రికవరీలో పోలీసుల అలసత్వం - Less Recoveries in Cyber Crimes

ఒకే బ్యాంకు ఖాతాలోకి రూ.124.25 కోట్లు బదిలీ - Fraudsters Transfer Rs124 Crores

Last Updated : Oct 1, 2024, 6:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.