ETV Bharat / state

సీఎం చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్‌రెడ్డి - చర్చలను స్వాగతిస్తూ రిప్లై - Telangana CM Revanth Reddy Letter - TELANGANA CM REVANTH REDDY LETTER

Telangana CM Revanth Reddy Letter: సీఎం చంద్రబాబు లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న ప్రజాభవన్‌లో చర్చలకు చంద్రబాబును రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

Telangana CM Revanth Reddy Letter
Telangana CM Revanth Reddy Letter (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 2, 2024, 7:44 PM IST

Updated : Jul 2, 2024, 8:18 PM IST

Telangana CM Revanth Reddy Letter: విభజన సమస్యలపై చర్చించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఈ మేరకు చర్చల ప్రతిపాదనను స్వాగతిస్తూ చంద్రబాబుకు రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. ఈ నెల 6న ప్రజాభవన్‌లో చర్చలకు చంద్రబాబును రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. అదే విధంగా ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరఫున చంద్రబాబును ఆహ్వానిస్తున్నానని, మీ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. పెండింగ్‌లోని విభజన సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. నాలుగోసారి సీఎం అయిన అరుదైన నేత చంద్రబాబు అని కొనియాడారు.

సీఎం చంద్రబాబు లేఖపై స్పందించిన రేవంత్‌రెడ్డి - చర్చలను స్వాగతిస్తూ రిప్లై - Telangana CM Revanth Reddy Letter

CM CHANDRABABU LETTER TO REVANTH REDDY: విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన జరిగి పదేళ్లవుతోన్నందున విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలుదఫాలుగా చర్చలు జరిగినా, పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయని గుర్తు చేసారు. వీటికి సామరస్యపూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల సంక్షేమం, పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రాసిన లేఖలో అభిప్రాయపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుందని అయన స్పష్టం చేశారు.

ఈ చర్చలు మంచి ఫలితాలిస్తాయనే నమ్మకం ఉంది’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సుస్థిర ప్రగతి సాధించడానికి, రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరమని తేల్చిచెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత అన్న చంద్రబాబు, ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకం’ అని వివరించారు. తెలంగాణ అభివృద్ధి, ప్రగతికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు లేఖకు రేవంత్ రెడ్డి స్పందించారు.

రేపు సాయంత్రం దిల్లీకి సీఎం చంద్రబాబు- బడ్జెట్​ ప్రతిపాదనలపై చర్చలు!

Last Updated : Jul 2, 2024, 8:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.