ETV Bharat / state

చివరి రోజున సియోల్​లో బిజీబిజీగా సీఎం రేవంత్ టీమ్ - రేపు రాష్ట్రానికి రాక - CM REVANTH SEOUL TOUR ENDS - CM REVANTH SEOUL TOUR ENDS

CM Revanth Foreign Tour Ends : పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన నేటితో ముగియనుంది. చివరి రోజు దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. సోమవారం చియోన్ జి చియోన్ స్ట్రీమ్​ను పరిశీలించిన సీఎం, నేడు హన్ రివర్ ఫ్రంట్, కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించనున్నారు. పర్యటన ముగించుకొని సింగపూర్ మీదుగా బుధవారం హైదరాబాద్‌కు రానున్నారు. అమెరికాలోనే సుమారు 31 వేల 532 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

CM Revanth Foreign Tour Ends
CM Revanth Reddy America Tour Ends Today (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 13, 2024, 7:08 AM IST

Updated : Aug 13, 2024, 8:34 AM IST

CM Revanth Reddy Seoul Tour Ends Today : సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నేటితో ముగియనుంది. ఇవాళ దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరపనున్నారు. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్​తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించనున్నారు. శాంసంగ్, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కల్టెక్స్, సెల్ ట్రయాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చించనున్నారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టు కోసం సోమవారం రాత్రి చియోన్ జి చియోన్ స్ట్రీమ్‌ను సీఎం పరిశీలించారు.

సియోల్‌లోని చుంగ్‌ గే చంగ్‌ నది పరిసరాలను సీఎం రేవంత్​ సందర్శించారు. నది సుందరీకరణ తీరుతెన్నులను తెలుసుకున్నారు. నేడు హన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్‌తో సమావేశం కానున్నారు. కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం బృందం సందర్శించనుంది. దక్షిణ కొరియా పర్యటన ముగించుకొని రాత్రి సింగపూర్ మీదుగా బయలుదేరి, బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం, దాదాపు యాభైకి పైగా బిజినెస్ మీటింగ్​లు, మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది.

ఫ్యూచర్ స్టేట్‌గా తెలంగాణ : అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తిని ప్రదర్శించాయి. ప్రముఖ బహుళ జాతి సంస్థలు కాగ్నిజెంట్, చార్లెస్ స్క్వాబ్, ఆర్సీసియం, కార్నింగ్‌, ఆమ్జెన్, జొయిటిస్, హెచ్‌సీఏ హెల్త్ కేర్, వివింట్ ఫార్మా, థర్మో ఫిసర్, ఆరమ్ ఈక్విటీ, ట్రైజిన్ టెక్నాలజీస్, మోనార్క్, ట్రాక్టర్, అమెజాన్ కంపెనీలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేశాయి.

యాపిల్, గూగుల్, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలతో పాటు, ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. అమెరికా పర్యటనలో రూ.31వేల 532 కోట్ల పెట్టుబడులను సాధించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా ప్రకటించి, హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు పారిశ్రామికవేత్తలకు వివరించారు. దాదాపు 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో రాష్ట్రంలో 30 వేల 750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.

రాష్ట్రంలో విదేశీ ప్రతినిధుల పర్యటన : వరంగల్ టెక్స్​టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా టెక్స్​టైల్ పరిశ్రమల సమాఖ్య సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. సియోల్​లోని ప్రముఖ బహుళ జాతి సంస్థ ఎల్ఎస్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఎల‌క్ట్రిక్ కేబుళ్లు, గ్యాస్‌, విద్యుత్‌, బ్యాట‌రీల ఉత్పత్తి రంగంలో పెట్టుబడులపై ఆ కంపెనీ ఆసక్తితో ఉంది.

సియోల్​లో సీఎం రేవంత్ పెట్టుబడుల వేట - మెగా కారు టెస్టింగ్ కేంద్రం ఏర్పాటుకు హ్యుందాయ్ సంసిద్ధత - CM Revanth South Korea Tour

ముగిసిన అమెరికా పర్యటన - సియోల్​కు చేరుకున్న రేవంత్&టీమ్ - CM REVANTH SEOUL TOUR TODAY

Last Updated : Aug 13, 2024, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.