Telangana Cabinet Meeting For Budget Sessions : రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా రెండోసారి అసెంబ్లీ సమావేశాలకు సమాయాత్తమవుతోంది. ప్రధానంగా బడ్జెట్, గవర్నర్ ప్రసంగంపై చర్చించేందుకు ఆదివారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సైతం ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈనెల 8 నుంచి బడ్జెట్ సమావేశాలు(Budget Meetings) నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఈనెల 8న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 9న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రజలను వేధిస్తే వేటే - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
ఈనెల 10న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెట్టి, 12 వ తేదీ నుంచి అయిదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. ఈనెల 4న సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో బడ్జెట్‌పై చర్చించనున్నారు. వివిధ శాఖలు ఇప్పటికే బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాయి. ఓటాన్ అకౌంట్ అకౌంట్‌కు, గవర్నర్(Governor Tamilisai) ప్రసంగానికి ఆమోదం తెలపడంతో పాటు, ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో మరో రెండు కొత్త పథకాలపై మంత్రివర్గం చర్చించనుంది.
CM Review on Six Guarantees For Budget Plan : రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత్ విద్యుత్ పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమల్లోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.
త్వరలో మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం - కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది, ఎంత మందికి లబ్ధి చేకూరుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ బడ్జెట్‌లోనే వాటికి నిధులు కేటాయించాలని రేవంత్ రెడ్డి ఆర్థికశాఖకు సూచించారు. శాసనసభ సమావేశాల్లోపు మరోసారి మంత్రివర్గ ఉపసంఘంతో(Cabinet Subcommittee) సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆ రెండు పథకాలతో పాటు, గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చునని భావిస్తున్నారు.
State Treasury Mobilized Through Loans : రాష్ట్ర ప్రభుత్వం రుణాల ద్వారా మరో 2000 కోట్ల రూపాయలు సమీకరించుకోనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ రిజర్వ్ బ్యాంక్ ద్వారా బాండ్లు జారీ చేసింది. వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 11 ఏళ్ల కాలానికి, మరో వెయ్యి కోట్ల విలువైన బాండ్లను 21 ఏళ్ల కాలానికి విడుదల చేశారు. బాండ్లను ఆర్బీఐ(RBI) వచ్చే మంగళవారం వేలం వేయనుంది. వేలం అనంతరం ఆ మొత్తం రాష్ట్ర ఖజానాకు చేరనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 4400 కోట్ల రూపాయలు రుణాల ద్వారా సమీకరించుకొంది. తాజాగా అప్పుతో ఆ మొత్తం రూ.6400 కోట్లకు చేరనుంది. మా ప్రభుత్వాన్ని పడగొట్టేది ఎవరు?: సీఎం రేవంత్‌రెడ్డి
మహిళలు ఆత్మగౌరవంతో బతకాలనేదే మా ఉద్దేశం- నాగోబా పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి