ETV Bharat / state

అసెంబ్లీ పోరులో ఓడించినా - లోక్​సభ వార్​లో గెలిపించారు - తెలంగాణ ప్రజల విలక్షణ తీర్పు - BJP wins telangana elections 2024

Telangana Election Results 2024 : రాష్ట్రంలో బీజేపీ గాలి వీచింది. కొందరు కమలం నేతలు 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలైనా, ఆర్నెల్లు తిరగక ముందే లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సత్తా చాటారు. అసెంబ్లీ గడప తొక్కాలని భావించిన ఈ నేతలను తిరస్కరించిన ప్రజలు, ఏకంగా ఇప్పుడు పార్లమెంట్‌కు పంపించారు. వీరిలో ఇద్దరు సిట్టింగ్‌ ఎంపీలు కాగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా పని చేశారు.

RAGHUNANDAN RAO WINS MEDAK MP SEAT
BJP wins Telangana Elections 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jun 4, 2024, 9:13 PM IST

Updated : Jun 4, 2024, 9:20 PM IST

BJP wins Telangana Elections 2024 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, కాషాయం పార్టీ దీటుగా ఎదుర్కొని లోక్‌సభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది. ప్రధాని నరేంద్ర మోదీ క్రేజ్‌కు తోడు, కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఓటర్లకు వివరించగలిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ దీటుగా ఎదుర్కోగలిగారు.

కాంగ్రెస్‌, బీజేపీలకు చెరో 8 సీట్లు - 'ఎంఐఎం'దే హైదరాబాద్ - తెలంగాణలో గెలిచిన ఎంపీ అభ్యర్థులు వీరే - MP Elections Results

కరీంనగర్‌లో సిట్టింగ్‌కే పట్టం.. లోక్‌సభ ఎన్నికల్లో బండి సంజయ్‌ ఘన విజయం సాధించారు. రాజకీయంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఆయన, నవంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా, ఏమాత్రం పట్టు సడలకుండా నియోజవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 2.12లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో బండి సంజయ్‌ గెలుపొందారు.

ఇందూరులో రెండోసారి ఘనవిజయం.. ధర్మపురి అర్వింద్‌ నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్‌ చేతిలో 10,300 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. సిట్టింగ్‌ ఎంపీగా ఉన్న అర్వింద్‌ లోక్‌సభ ఎన్నికలు వచ్చేసరికి వ్యూహం మార్చారు. మోదీ చరిష్మాకు తోడు.. తన వ్యూహానికి పదును పెట్టారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ 1.13లక్షలకు పైగా మెజార్టీతో అర్వింద్‌ విజయం సాధించారు.

మెదక్‌లో రఘునందన్‌ విజయఢంకా.. మెదక్‌ జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్‌రావు, బీఆర్ఎస్‌ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయినా, ఆయన పై నమ్మకంతో బీజేపీ అధిష్ఠానం మెదక్‌ టికెట్‌ ఇచ్చింది. న్యాయవాది, మంచి వాగ్దాటి కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందిన రఘునందన్‌ను లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించారు. బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొని మెదక్‌ గడ్డపై 25 ఏళ్ల తర్వాత బీజేపీ జెండా రెప రెపలాడించారు.

మల్కాజిగిరిలో ఈటల హవా.. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లోపోటీ చేసిన ఈటల రాజేందర్‌ బీఆర్ఎస్‌ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి చేతిలో చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో ఈటల పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఈటల, లోక్‌సభ ఎన్నికలకు వచ్చే సరికి వ్యూహం మార్చారు. మినీ ఇండియాగా పేరున్న మల్కాజిగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతా మహేందర్‌రెడ్డి పై 3.86లక్షల ఓట్ల మెజారిటీతో ఎంపీగా జయకేతనం ఎగురవేశారు.

రాష్ట్రంలో సత్తా చాటిన బీజేపీ - విజయంపై నేతల రియాక్షన్​ ఇదే - telangana lok sabha election results 2024

అసెంబ్లీ - లోక్​సభ ఫలితాల్లో సేమ్ టు​ సేమ్​ - 8 స్థానాలు కైవసం చేసుకున్న కాషాయదళం - Telangana Loksabha Elections 2024

Last Updated : Jun 4, 2024, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.