సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పద్దులు ఆమోదించుకుంటున్నారని బీఆర్ఎస్, బీజేపీ వాకౌట్.
LIVE UPDATES : దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు : కేటీఆర్ - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES - TG ASSEMLBLY SESSIONS LIVE UPDATES
Published : Jul 30, 2024, 10:07 AM IST
|Updated : Jul 30, 2024, 10:42 PM IST
Telangana Assembly Session Today : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న స్కిల్ యూనివర్సిటీ బిల్లు మంగళవారం శాసనసభ ముందుకు వచ్చింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లు- 2024ను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ పద్దులపై శాసనసభలో మంగళవారం చివరి రోజు చర్చ జరగుతోంది. మరో 19 పద్దులపై అసెంబ్లీలో చర్చిస్తూ మంత్రులు సమాధానం ఇస్తున్నారు. వ్యవసాయం, నీటిపారుదల, పంచాయితీ రాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, సంక్షేమ శాఖ పద్దులపై చర్చ జరగుతోంది. మంగళవారం సైతం శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు.
LIVE FEED
శాసనసభ రేపటికి వాయిదా
దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎందుకు ఇవ్వట్లేదు: కేటీఆర్
రేషన్‌కార్డులు ఉన్న వారికి సన్నబియ్యం ఇస్తామన్నందుకు సంతోషమని ప్రజాస్వామ్యంలో చర్చతో పాటు నిరసన కూడా ఉండాలని బీఆర్ఎస్ కేటీఆర్ అన్నారు.
కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తామని గంగుల చెప్పారని దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పి ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు.
మిల్లర్ల వద్ద డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? రూ.1100 కోట్ల కుంభకోణం జరిగిందని సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. మంత్రిని నిందించడం లేదని పెద్దవారిని నిందిస్తున్నామన్నారు. ప్రభుత్వం వైఖరికి నిరసనగా ఈ అంశంపై వాకౌట్ చేస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ సభ్యులు చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం
బీఆర్ఎస్ సభ్యులు చప్పట్లు కొడుతూ నిరసన వ్యక్తం చేయడంపై డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా చేయడం కరెక్ట్ కాదని డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి చేశారు.
సభ సాంప్రదాయాలను మంటగలుపుతున్నారని వారి నిరసనలకు, అరుపులకు భయపడి పోయే వాళ్లం కాదని హెచ్చరించారు.
అర్హులందరికీ త్వరలో రేషన్‌కార్డులు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
అర్హులందరికీ త్వరలో రేషన్‌కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లుండి కేబినెట్ భేటీలో విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు.
త్వరలో రేషన్ కార్డులపై సన్నబియ్యం అందిస్తామని తెలిపారు.తెల్లరేషన్‌కార్డు ఉన్నవారందరికీ రూ.500 సిలిండర్ ఇస్తామని తెలిపారు.
రైతుల ఆత్మహత్యలపై ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదు : పల్లా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల ఆత్మహత్యలపై ఒక్క మంత్రి కూడా ఇప్పటివరకు స్పందించలేదని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గతంలో రెండుసార్లు కేసీఆర్ రుణమాఫీ చేశారని తెలిపారు. పీఎం కిసాన్ 13 కోట్ల మందికని చెప్పి 3 కోట్ల మందికే పీఎం కిసాన్ ఇస్తున్నారని పల్లా తెలిపారు.
ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాలు : మంత్రి సీతక్క
ఆగస్టు 5 నుంచి 13 వరకు గ్రామాల్లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమలు ఉంటాయని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని మంత్రి సీతక్క తెలిపారు. పల్లెల ప్రగతి కోసం చేపట్టే కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పాల్గొనాలని సూచించారు.
ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేయాలి : ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ధరణి పోర్టల్‌లో జరిగిన అక్రమాలల్లో బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కాపాడుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. భూముల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణకు కాంగ్రెస్ డిమాండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు చేయకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రసాయంపై చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ధరణిపై ఎందుకు విచారణ జరగట్లేదని ప్రశ్నించారు
రుణమాఫీ కార్యక్రమంలో సభ్యులంతా పాల్గొనాలని కోరిన స్పీకర్
శాసనసభ అరగంటపాటు వాయిదా పడింది. రుణమాఫీ కార్యక్రమంలో సభ్యులంతా పాల్గొనాలని స్పీకర్ కోరారు.
పోడుభూముల పంపిణీలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేసిందని ఎమ్మెల్యే అనిల్ పేర్కొన్నారు. గిరి వికాస్ పథకం కింద అన్ని ఎస్టీ కుటుంబాలకు రూ.2 లక్షలు ఇచ్చామని చెప్పారు.
బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు : సీతక్క
ఎస్టీలకు పోడు భూముల చట్టం ద్వారా 2006లో లబ్ధి కలిగించామని మంత్రి సీతక్క తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎస్టీలకు మీరేమీ చేయలేదని బీఆర్ఎస్ను ఉద్దేశిస్తూ విమర్శించారు. పదేళ్ల పాలనలో ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి అని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో ఎస్టీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. తన తల్లిదండ్రులకు చట్టప్రకారమే పోడుభూముల హక్కు వచ్చిందని తెలిపారు. అడవిని ఆధారంగా చేసుకుని బతికే కుటుంబాలు తనవని చెప్పారు.
ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సరికాదు : కేటీఆర్
ఒకేరోజు 19 పద్దులపై చర్చ పెట్టడం సరికాదని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రోజుకో పద్దుపై చర్చిస్తే అందరూ మాట్లాడేందుకు అవకాశం ఉంటుందని సూచించారు.
శాసనసభకు కొత్తగా 50 మంది సభ్యులు వచ్చారని, కొత్త సభ్యులకు మాట్లాడాలనే ఉత్సాహం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలనైనా 20 రోజులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
మరో 19 పద్దులపై శాసనసభలో కొనసాగుతున్న చర్చ
వ్యవసాయం, సహకార, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, గృహనిర్మాణం పద్దులపై చర్చ జరుగుతోంది. వీటితోపాటు పౌరసరఫరాలు, పశుసంవర్ధక, పర్యాటక, క్రీడాశాఖలు, అటవీ, దేవదాయ, మైనార్టీ, చేనేత, స్త్రీ శిశు సంక్షేమశాఖ పద్దులపై చర్చ జరగుతోంది.
సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని సభ్యులందరికీ విజ్ఞప్తి : సభాపతి
సోమవారంలా సుదీర్ఘ ప్రసంగాలు చేయవద్దని సభాపతి సభ్యులను కోరారు. సబ్జెక్ట్‌పైనే మాట్లాడాలని సభ్యులందరికీ విజ్ఞప్తి చేశారు.
శాసనసభలో 19 డిమాండ్లపై కొనసాగుతున్న చర్చ
శాసనసభలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. స్కిల్ వర్సిటీ బిల్లును సభలో మంత్రి శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టారు.