Teachers Day celebrations at Ramadevi Public School: హైదరాబాద్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్‌లో టీచర్స్‌డేను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ప్రత్యేకంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బృందం హాజరై, ఉపాధ్యాయులను సన్మానించింది. ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ ఎం. మహేశ్వరస్వామి హాజరుకాగా, చీఫ్ మేనేజర్ వంశీచంద్ రెడ్డి భాగస్వామ్యమయ్యారు. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. గురువుల ప్రాధాన్యాన్ని వివరించేలా వారు చేపట్టిన ప్రత్యేక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.
యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ మహేశ్వర స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ వారి జీవితంలో గురువు చాలా అవసరమని, ఏమి ఆశించకుండా విద్య నేర్పేది కేవలం ఒక్క ఉపాధ్యాయుడేనని, గురువు గొప్పతనాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు. రమాదేవి పబ్లిక్ స్కూల్‌కి రావడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం రామోజీ గ్రూప్ సంస్థ అధినేత దివంగత రామోజీరావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రామోజీ ఫౌండేషన్ ట్రస్టీ రావి చంద్రశేఖర్, పాఠశాల ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.