ETV Bharat / state

'నాకు మార్కులు వేయకపోతే, చేతబడి చేయిస్తా' - పదో తరగతి విద్యార్థి వార్నింగ్​ - 10th class student answer sheet

AP 10th Class Student Warning to Teacher : పదో తరగతి విద్యార్థి జవాబుపత్రంలో ‘నాకు మార్కులు వేయకపోతే, మా తాత చేత చేతబడి చేయిస్తానంటూ, ఓ ప్రశ్నకు సమాధానం రాశాడు. తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా ' మార్కులు వేయాలంటూ డిమాండ్ చేశాడు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం కేంద్రంలో ఈ విషయం బయట పడింది.

AP 10th class student answer sheet
AP 10th class student answer sheet
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 2:52 PM IST

Updated : Apr 10, 2024, 3:38 PM IST

AP 10th Class Student Warning to Teacher : పదో తరగతి ఉత్తీర్ణత అనేది విద్యార్థి దశలో కీలక ఘట్టం. ఉన్నత చదువులు చదవాలన్నా, కనీసం ఇతం వరకూ చదివానని చెప్పుకోవాలన్నా పదవ తరగతి ప్రామాణికంగా చెబుతారు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించాలన్నా, కనీస విద్యార్హత పదవ తరగతిగా నిర్ణయిస్తారు. ఒకప్పుడు పదవ తరగతి ఉత్తీర్ణుడు అంటే గొప్పగా చెప్పుకునేవారు. కాలం మారుతున్న కొద్దీ విద్య అందరికీ అందుబాటులోకి రావడం, విద్యావిధానంలో పెనుమార్పుల చోటు చేసుకోవడంతో గత కొంత కాలంగా పదవ తరగతి ఉత్తీర్ణత అనేది అరటి పండు వలిచినంత తేలిక అనే అభిప్రాయం విద్యార్థుల్లో నెలకొంది.

ఒకవేళ పరీక్షలు తప్పినా, మరో రెండు నెలల్లో సప్లిమెంటరీ పరీక్షలు ఉండనే ఉన్నాయి. ఇక విద్యార్థులకు పదవ తరగతి పాస్ అవకపోతే అనే ఆలోచనే ఉండటం లేదు. కానీ ఈ పరీక్ష ఉత్తీర్ణత కోసం ఓ విద్యార్థి చేసిన పని ఇప్పుడు సంచలనం రేపుతోంది. పదవ తరగతి విద్యార్థి జవాబుపత్రంలో సమాధానం చూసి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రంలోని ఉపాధ్యాయులు ఆశ్చర్యపోయారు. తనకు మార్కులు వేయాలంటూ ఆ విద్యార్థి సమాధాన పత్రంలో రాసింది చదివిన ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కంగుతిన్న ఘటన బాపట్ల జిల్లాలో చోటు చేసుకుంది.

Sexual Harassment in sri satyasai district గాడి తప్పిన ఉపాధ్యాయుడు.. లైెంగిక దాడికి బలైన బాలిక..

వివరాల్లోకి వెళ్తే పదో తరగతి పరీక్షలో ఓ విద్యార్థి ‘నాకు మార్కులు వేయకపోతే, మా తాత చేత చేతబడి చేయిస్తా.' ఇదీ ఇటీవల పదో తరగతి పబ్లిక్ పరీక్ష రాసిన ఓ విద్యార్థి సమాధానం. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. తెలుగు సబ్జెక్టులో రామాయణం ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్నకు ఒక విద్యార్థి తగిన సమాధానం రాయకుండా, 'నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా' అని రాయడంతో ఉపాధ్యాయులు అవాక్కయ్యారు. వెంటనే జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు. అయితే, సదరు విద్యార్థికి వందకు 70 మార్కులు రావడం విశేషం. మరో జవాబు పత్రంలో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు 'మంధర శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది' అని రాయడంతో ఉపాధ్యాయులు విస్తుపోయారు.

పదో తరగతి విద్యార్థినిని సజీవదహనం చేసిన దుండగులు- అదే కారణమా?

Last Updated : Apr 10, 2024, 3:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.