ETV Bharat / state

ఈనాడు పత్రిక ప్రజల గొంతుక- అందరికీ ఆదర్శ ప్రాయమన్న టీడీపీ నేతలు - TDP Wishes TO EENADU 50 Years

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 10, 2024, 12:51 PM IST

TDP Leaders Wishes To EENADU 50 Years: స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టిన ఈనాడుకు పలువురు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 50 ఏళ్ల స్వర్ణోత్సవం వేళ వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు లేకపోవడం బాధాకరమంటున్నారు. ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటానికి ఐదు దశాబ్ధాలని మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు.

TDP Leaders Wishes To EENADU 50 Years
TDP Leaders Wishes To EENADU 50 Years (ETV Bharat)

TDP Leaders Wishes To EENADU 50 Years: "ఈనాడు" 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం నేతలు స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు, నేడు, ఏనాడూ "ఈనాడు" అభిమతం, జనహితమని ఎంపీ కేశినేని శివనాథ్ కొనియాడారు. "ఈనాడు" 50 ఏళ్ల స్వర్ణోత్సవం వేళ వ్యవస్థాపక ఛైర్మన్ రామోజీరావు లేకపోవడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. కానీ "ఈనాడు" రూపంలో ఆయన మన మధ్యే జీవించి ఉంటారని చెప్పారు. ప్రజలు, సమాజం కోసం తాపత్రయపడే "ఈనాడు" స్ఫూర్తి చిరస్మరణీయమని మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు.

ప్రజల తరఫున పోరాటంలో తలవంచని "ఈనాడు" స్ఫూర్తి అందరికీ ఆదర్శ ప్రాయమన్నారు. పత్రిక ఏర్పాటు చేసి 50 సంవత్సరాలైనా అదే నిబద్ధతతో వార్తలు అందించడం గర్వ కారణమని తెలిపారు. నిజాయితీకి, విలువలకి, నిలువుటద్ధమైనది "ఈనాడు" అని దేవినేని ఉమా అన్నారు. ప్రజలకు ఆపద వచ్చిన ప్రతిసారి ఆపన్న హస్తం అందిస్తుందని తెలిపారు. "ఈనాడు" మరిన్ని వసంతాలు పూర్తి చేసుకోవాలని టీడీపీ నేతలు ఆకాంక్షించారు.

ఈనాడు మా ప్రభుత్వంలోని తప్పులను చూపించింది - వాటిని సరిదిద్దుకున్న సందర్భాలు అనేకం : సీఎం చంద్రబాబు - CBN Wishes on Eenadu 50 Years

ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటానికి ఐదు దశాబ్ధాలంటూ ఈనాడు స్వర్ణోత్సవాన్ని పురస్కరించుకుని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనాడు మొదటగా స్థాపించిన విశాఖ సీతమ్మధార, సిరిపురం రేడియో కేంద్రం జంక్షన్ వద్ద ఎంపీ కలిశెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ రాజధాని దిల్లీ, బెంగుళూరు, విజయనగరంలోని గంట స్థంభం, కలెక్టరేట్‌, అశోక్ బంగ్లా, ఆర్టీసీ కాంప్లెక్స్‌తోపాటు శ్రీకాకుళంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభినందనలు తెలిపారు.

ఈనాడు అంటే నీతి, నిజాయితీకి అక్షర రూపం అని ఎంపీ అన్నారు. రామోజీరావు నీతి నిజాయితీతో ఈనాడును నడిపి జర్నలిజానికి గౌరవాన్ని పెంచారన్నారు. వాస్తవాలను అక్షర రూపం దాల్చి వార్తగా మలిచి తెలుగు ప్రజల నమ్మకాన్ని 50 వసంతాలు నిలబెట్టుకున్న ఏకైక పత్రిక ఈనాడు అని కొనియాడారు. ఈనాడులో రిపోర్టర్​గా పని చేయడం తన అదృష్టమని ఈనాడులో పని చేయడం వల్లే క్రమశిక్షణ, నిజాయితీ, పని పట్ల నిబద్దతగా అలవరుచుకోగలిగానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో ఎంపీ కలిశెట్టి కేక్‌ కోసి సంబరాలు జరిపారు.

గుడ్‌ మార్నింగ్‌ అంటూ తెలుగువారిని మేల్కొలిపే ఈనాడు వెయ్యేళ్లు వర్థిల్లాలి: మంత్రి లోకేశ్​ - Lokesh Congratulate Eenadu 50 Years

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.