ETV Bharat / state

జగన్ పతనానికి జనమే స్టార్ క్యాంపెయినర్లు: టీడీపీ - సునీత

TDP leaders react on CM Jagan Comments: అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు చాలామంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు క్యాంపెయినర్లంతా పక్క రాష్ట్రంలోనే ఉంటారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఆరోపణలపై తెలుగుదేశం నేతలు స్పందించారు. మోసపూరిత మాటలతో ప్రజలను ఇంకెనేళ్లు మోసం చేస్తారంటూ జగన్ పై మండిపడ్డారు.

TDP leaders react on  CM Jagan Comments
TDP leaders react on CM Jagan Comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 23, 2024, 5:55 PM IST

Updated : Jan 23, 2024, 7:40 PM IST

TDP leaders react on CM Jagan Comments: అనంతపురం జిల్లా ఉరవకొండ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం నేతలు కౌంటర్ ఇచ్చారు. అక్కాచెల్లెమ్మలను చివరిసారి కూడా మోసం చేసేశాడని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఆరోపించగా, రాజకీయ లభ్ధి కోసమే జగన్ రెడ్డి బీసీ కులగణన చేపట్టాడని కాలవ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్నారని పరిటాల సునీత ఆరోపించగా, మోసపూరిత మాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని పయ్యావుల కేశవ్‌ మండిపడ్డారు.

నక్కా ఆనంద్ బాబు: జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కితే ఆ డబ్బు మహిళల ఖాతాలోకి కాకుండా తాడేపల్లి ప్యాలెస్ కు పోతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకే ఎన్నికల్లో లక్షలాది మంది స్టార్ క్యాంపైనర్లు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కోడికత్తి శ్రీను సహా, ఊచకోతకు గురైన 300మంది దళితులంతా జగన్ ఓటమి కోసం పని చేసే స్టార్ క్యాంపైనర్లేనని నక్కా ఆనంద్ బాబు తెలిపారు. మద్యనిషేధం హామీ అమలు చేయకపోగా నాసిరకం మద్యంతో తాళిబొట్టు తెగిన ప్రతీ మహిళా స్టార్ క్యాంపైనరేనన్నారు. జగన్మోహన్ రెడ్డి నియంతృత్వ పోకడలు తట్టుకోలేక ఆ పార్టీ ఖాళీ చేసేందుకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారని తెలిపారు.

జగన్‌ నియంతృత్వ పోకడలతో వైఎస్సార్సీపీ ఖాళీ: టీడీపీ

వైద్యం అందక మరో గిరిజన బిడ్డ మరణం - 15 రోజుల్లోనే ముగ్గురు మృతి

కాలవ శ్రీనివాసులు: రాజకీయ లభ్ధికోసమే జగన్ రెడ్డి బీసీ కులగణన చేపట్టాడని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లు పొందాలనే రాజకీయ కుట్ర తప్ప, నిజంగా ఆ వర్గాలకు మంచి చేయాలనే ఆలోచన జగన్​కు లేదని మండిపడ్డారు. ఇన్నేళ్లూ కులగణనపై కేంద్రప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేయలేదని నిలదీశారు. అడగాల్సిన చోట అడగకుండా, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకుండా బీసీల కులగణన పేరుతో కుట్రలు చేయడం జగన్ రెడ్డి రాజకీయ అవకాశవాదమేనని కాలవ శ్రీనివాసులు దుయ్యబట్టారు.

అధికారం అండతో కొల్లేరును గుల్ల చేస్తున్న అక్రమార్కులు - జగన్‌ హామీ డొల్ల

పయ్యావుల కేశవ్‌: ఉరవకొండ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాటలు వింటే బేళతనం కనిపించిందని తెలుగుదేశం సీనియర్‌ నేత పయ్యావుల కేశవ్‌ అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో బాధింపబడిన అన్నివర్గాల ప్రజలు తెలుగుదేశం పార్టీకి స్టార్‌ క్యాంపెయినర్లని చురకలంటించారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టులు పడకేశాయన్న పయ్యావుల, మోసపూరిత మాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని మండిపడ్డారు.

పరిటాల సునీత: ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా వేశారని మాజీ మంత్రి పరిటాల సునీత దుయ్యబట్టారు. చంద్రన్న కోటి మంది డ్వాక్రా మహిళలకు సంక్షేమం అందిస్తే జగన్ రెడ్డి 79 లక్షలకు కుదించేశారని ఆమె మండిపడ్డారు. జగన్ రెడ్డి నాసిరకం మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్నారని ఆరోపించారు. పిన్నమ్మ తాళి తెంచిన నరహంతకుల్ని రక్షిస్తున్న జగన్ రెడ్డి మహిళా ద్రోహి కాదా అని నిలదీశారు. ధరలు పెంచి ఒక్కో కుటుంబంపై 3 లక్షల భారం మోపారని పరిటాల సునీత ఆరోపించారు. అత్యాచారాలకు ఏపీని కేరాఫ్ గా మార్చిన జగన్ రెడ్డి మహిళలను రక్షిస్తాడా అని ప్రశ్నించారు.

ఆర్థిక సాయం పెంచుతున్నట్లు బిల్డప్​ - లబ్దిదారుల కుదింపు - ఇవే జగన్​ మార్క్​ ఐడియాలు

Last Updated : Jan 23, 2024, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.