ETV Bharat / state

కిర్గిస్థాన్​లోని ఏపీ విద్యార్థులతో మాట్లాడిన టీడీపీ నేతలు - పూర్తి సహకారం అందిస్తామని భరోసా - TDP Zoom call to Kyrgyzstan Issue - TDP ZOOM CALL TO KYRGYZSTAN ISSUE

TDP Leaders Rammohan and Bharath Zoom Call to Kyrgyzstan Students : కిర్గిస్థాన్ రాజధాని బిషెక్‌లో గత మూడు రోజులుగా విదేశీ విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు విద్యార్థులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ రాష్ట్రానికి చెందిన విద్యార్థుల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. విదేశాంగ శాఖ నుంచి పూర్తి సహాయ సహకారాలు వచ్చేవరకు నిరంతరం కృషి చేస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు.

TDP Leaders Rammohan and Bharath Zoom Call to Kyrgyzstan Students
TDP Leaders Rammohan and Bharath Zoom Call to Kyrgyzstan Students (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 19, 2024, 10:38 PM IST

TDP Leaders Rammohan and Bharath Zoom Call to Kyrgyzstan Students : కిర్గిజ్​స్థాన్ రాజధాని బిష్కెక్​లో గత మూడు రోజులుగా విదేశీ విద్యార్థులపైన దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్​కు చెందిన విద్యార్థుల బాగోగులు తెలుసుకోవడానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నం తెలుగుదేశం పార్లమెంటరీ ఇంఛార్జి శ్రీ భరత్, తెలుగు యువత జనరల్ సెక్రటరీ నాగ శ్రవణ్ కిలారులు బిష్కెక్​లో ఉన్న విద్యార్ధులతో జూమ్ కాల్​లో పాల్గొని వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ధైర్యంగా, సహనంతో అప్రమత్తంగా ఉండాలని, భారత దేశ ఎంబసీకి ఎప్పటికప్పుడు తమ సమాచారం ఇవ్వాలి అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

చైనా సైబర్‌ ముఠా చేతిలో ఏపీ వాసులు - ముగ్గురిని అరెస్టు చేసిన విశాఖ పోలీసులు - police arrested Human trafficking

పూర్తి సహాయ సహకారాలు అందేవరకు కృషి : దేశ విదేశాంగ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు వచ్చేవరకూ నిరంతరం కృషి చేస్తామని ఆయన విద్యార్థులకు ధైర్యం చెప్పారు. విద్యార్థులు అత్యవసరానికి తప్పితే బయటకు రాకుండా జాగ్రత్త పడాలని భరత్ సూచించారు. భారత విదేశాంగ శాఖ ద్వారా వారికి అన్ని సహకారాలు అందించే విధంగా తెలుగుదేశం పార్టీ ద్వారా భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామని, విద్యార్ధులు మనో ధైర్యంతో ఉండాలని కోరారు.

భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ విద్యార్థులపై దాడులు : అయితే కిర్గిజ్‌స్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా భారత్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ విద్యార్థులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. ఈ గొడవలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో వైద్య విద్యకు ఏపీ నుంచి కిర్గిజ్‌స్థాన్‌ వెళ్లిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికులకు, ఈజిప్ట్‌ విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ తర్వాత అల్లరి మూకలు విదేశీ విద్యార్థులపై దాడులు చేయడం ప్రారంభించాయి.

చట్టసభల సభ్యులపై ఏళ్లకేళ్లు కోర్టుల్లో కేసుల విచారణలు - మరి తేలేదెన్నడు? - CRIMINAL CASES ON POLITICIANS

కిర్గిజ్​స్థాన్​లో విజయనగరం విద్యార్థులు : విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన వి.వంశీ, ఎ.దినేష్, సీహెచ్‌ సురేంద్ర, జి.సోమేష్, నవీన్, భార్గవ్, బి.రేష్మ, గండి సోమేశ్వరరావు తదితర 12 నుంచి 15 మంది విద్యార్థులు కిర్గిజ్‌ రష్యన్‌ స్లావిక్‌ విశ్వవిద్యాలయం, మరికొన్ని వర్సిటీల్లో చదువుతున్నారు. వీరితో తల్లిదండ్రులు మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. గొడవలు వేరే వసతి గృహాల పరిధిలో జరిగాయని, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని విద్యార్థులు చెప్పినట్లు పలువురు తల్లిదండ్రులు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వారు తెలిపిన ప్రకారం వర్సిటీల యాజమాన్యాలు విద్యార్థులను వసతి గృహాలకు పరిమితం చేసి గేట్లను మూసేశాయి.

స్థానిక పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయడం ద్వారా ఆందోళనకారులను వసతి గృహాల్లోకి రాకుండా నిలువరించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రతి హాస్టల్‌లో నలుగురు ప్రొఫెసర్‌లను విద్యార్థులకు తోడుగా ఉంచారు. పరిస్థితి సద్దుమణగకపోతే వారం రోజులపాటు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించేందుకు అక్కడి విశ్వవిద్యాలయాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

కిర్గిస్థాన్​లోని ఏపీ విద్యార్థులతో మాట్లాడిన టీడీపీ నేతలు - పూర్తి సహకారం అందిస్తామని భరోసా (ETV Bharat)

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే వరకు విడిగా పెట్రోలు, డీజిల్‌ విక్రయాలు వద్దు: ఈసీ - EC Orders TO Petrol Bunks IN AP

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.