ETV Bharat / state

పెన్షన్ల పంపిణీతో వృద్ధుల ప్రాణాలు తీసేందుకు మరోసారి సీఎస్ సిద్ధమయ్యారు: టీడీపీ నేతలు - TDP Leaders Fired on CS - TDP LEADERS FIRED ON CS

TDP Leaders Fired on CS over Distribution of Pensions: పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో సీఎం జగన్​కు లబ్ధి చేకూరేలాగ సీఎస్ చూస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. మరోమారు వృద్ధుల ప్రాణాలు తీసి జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖజానాలో నిధులు ఉంచకుండా జగన్ తన కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడని ఆరోపించారు.

tdp_leaders_fired_on_cs
tdp_leaders_fired_on_cs
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 29, 2024, 9:04 PM IST

TDP Leaders Fired on CS over Distribution of Pensions: పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో మరోమారు వృద్ధుల ప్రాణాలు తీసేందుకు వైసీపీ నేతలు సిద్ధమయ్యాని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. జగన్ శవరాజకీయాలు చేయడానికి మరోసారి సిద్దంగా ఉన్నారని అన్నారు..

TDP leader Varla Ramaiah: పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎస్ దారుణమైన నిర్ణయం తీసుకున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శించారు. పెన్షన్​ల పంపిణీ వ్యవహారంలో లబ్దిదారుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు అయిందన్నారు. మరోమారు వృద్ధుల ప్రాణాలు తీయాలని సీఎస్ చూస్తున్నరని అన్నారు. ఈ వ్యవహారంలో జగన్​కు లబ్ధి చేకూర్చాలని చూస్తున్నారని ఆరోపించారు. బ్యాంకు ఖాతాలకు పెన్షన్లు జమ చేస్తే లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయన్నారు. పెన్షన్ కోసం సచివాలయానికే వెళ్లలేని వారు బ్యాంకులకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. రాప్తాడులో ఇద్దరు ఎస్సీ యువకుల్ని కొట్టి వైసీపీ ఎమ్మెల్యే ఇంటికి తీసుకెళ్లారని దీన్ని ప్రశ్నించిన ఓ బీసీ నాయకుడిని కూడా కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్‌ సర్కారుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - ఇసుక అక్రమ తవ్వకాలు వెంటనే నిలిపివేయాలని ఆదేశం - Supreme Court Orders to AP Govt

TDP leader Devineni Uma: బ్యాంకుల ద్వారా పెన్షన్ పంపిణీ కుదరదన్న సెర్ప్ సీఈఓ ఇప్పుడెలా నిర్ణయించారని టీడీపీ నేత దేవినేని ఉమా ప్రశ్నించారు. సుమారు 48 లక్షల మందికి బ్యాంక్ ద్వారా చెల్లిస్తామని సీఎస్ ఎలా చెబుతారని నిలదీశారు. పెన్షన్ పంపిణీలో ఒక్క మరణం చోటు చేసుకున్నా అది సర్కారు హత్యలే అవుతాయన్నారు. పెన్షన్ కోసం వెళితే బ్యాంకులు వృద్ధుల్ని తిప్పుతాయి తప్ప సమయానికి ఇవ్వవని తెలిపారు. ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం చెప్పినా అధికారులు వినట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడులో టీడీపీ కార్యకర్తల్ని కొట్టారని దీనిపై ఫిర్యాదు చేసినా జిల్లా కలెక్టర్, ఆర్వో పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రచార రథాలను కాల్చుతుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. ఈ అంశాలన్నింటిపైనా ప్రత్యేక అబ్జర్వర్​కు, గవర్నర్​కు, సీఈసీకి ఫిర్యాదు చేశామని దేవినేని తెలిపారు.

ఓటర్లకు వైఎస్సార్సీపీ తాయిలాల ఎర - లక్షా 26 వేల కుక్కర్ కూపన్లు స్వాధీనం - YSRCP Cookers Distribution

TDP spokesperson Kolluri Venkateswara Rao: రాష్ట్రంలో మే నెలలో వృద్ధులకు ఇచ్చే పెన్షన్ల విషయంలో వారిని ఎండల్లో తిప్పించాలని కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. ఈ ఎండలో వారికేదైనా జరిగితే దానిని ప్రతిపక్షాలపై నెట్టి శవరాజకీయాలు చేసి లబ్ది పొందాలని జగన్ చూస్తున్నాడని అన్నారు. పెన్షన్లకు నిధులు ఉంచకుండా మార్చి నెలలోనే జగన్ తన కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడని ఆరోపించారు. మే నెలలో సైతం 1వ తేదీన పెన్షన్లు వృద్ధులకు నేరుగా ఇవ్వకుండా బ్యాంకు ఖాతాలలో వేస్తామని, ఖాతాలు లేని వారు సచివాలయంలో కానీ, ఇంటి వద్ద కానీ ఇస్తానని అనడం సరైన పద్ధతి కాదని అన్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా మే 1వ తేదీన ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల వ్యవహారంలో వృద్దులకు జరగరానిది ఏదైనా జరిగితే దానికి జగన్మోహనరెడ్డి బాధ్యత తీసుకోవాలని అన్నారు.

కూటమి మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ - హాజరుకానున్న ముఖ్యనేతలు - TDP JANASENA BJP MANIFESTO

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.