TDP Leaders Fire Anam Venkataramana Reddy : సీఎం జగన్ మోహన్ రెడ్డి, భారతి వ్యాపారంలో దేశంలో అపర మేథావులని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎద్దేవా చేశారు. సరస్వతీ పవర్ కంపెనీ పేరుతో 1999లో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి 2009లో 32 కోట్లుకు షేర్ క్యాపిటల్ చేశారని అన్నారు. 2009లో జగన్ 87లక్షల 8వేలు, భారతీ 80 లక్షలు సరస్వతీ పవర్లో పెట్టుబడులు పెట్టారు. 60 రోజుల్లోనే 18 కోట్ల 87లక్షలకు షేర్ వాల్యూ ఏ విధంగా పెంచగలిగారో అర్థం కావడం లేదని, ఈ మ్యాజిక్ ఏలా సాధ్యం అయ్యిందని ఆనం ప్రశ్నించారు. వారు చెప్పే సరస్వతీ కంపెనీకి కార్యాలయమే లేదని, కనీసం గోడ గుడిసే కూడా లేదని, షేర్ వాల్యూ మాత్రం భారీగా పెరిగిందని ఆరోపించారు. కంపెనీ ఉత్పత్తులు లేవని, టర్నవర్ లేని కంపెనీకి ఇంత ఆదాయం ఎలా సాధ్యమైందో జగనే చెప్పాలని ఆనం పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ముగ్గురు ముద్దుబిడ్డలు : ఆనం వెంకటరమణారెడ్డి
ఈ విధంగా మ్యాజిక్ చేయబట్టే జగన్ ఆర్థిక నేరస్దుడుగా జైలుకు పోయాడని వెంకటరమణారెడ్డి తెలిపారు. నల్లదనాన్ని వైట్ చేసుకోవడానికి ఆర్ధిక నేరస్ధుడుగా మారాడని ఎద్దేవా చేశారు. సరస్వతీ పవర్ కంపెనీకి లైమ్ స్టోన్‌తో పని లేదని అయినా లైమ్ స్టోన్ అనుమతులు ఎందుకు అడిగారని ప్రశ్నించారు. ఆ తరువాత మాత్రమే సిమెంట్ ఫ్యాక్టరీకి దరఖాస్తు చేశారని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే రెండు రోజులకు ముందు 107జీవో తీసుకువచ్చారని గుర్తు చేశారు. వీరి పేరుతో 1500 ఎకరాలు మైనింగ్ లీజులు ఇచ్చారని, ఇలాంటి అక్రమాలు చేస్తే కడిగిన ముత్యం అంటారా, ఆర్థిక నేరస్తుడు అంటారా అంటూ ప్రశ్నించారు.
తిరుపతి టీడీఆర్ బాండ్లలో సగానికి పైగా అవినీతే - ఆ సొమ్మంతా కక్కిస్తాం: ఆనం
ఈ భూములు ఇచ్చిన రైతుల గురించి జగన్ భారతీ ఆలోచించలేదని, ఫ్యాక్టరీ రాగానే కుటుంబానికి ఒక్క ఉద్యోగం అన్నారని గుర్తు చేశారు. అబద్దాలు చెప్పి ఆ కుటుంబాలకు అన్యాయం చేశారని ఆనం మండిపడ్డారు. ఈ రోజుకి కూడా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఆరోపించారు. భూములిచ్చిన రైతులపై దాడులు చేయించి, 150 మందిపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించారని విమర్శించారు. జగన్ వల్ల అనేక అనేక కుటుంబాలు వలసలు పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమర్ రాజా బ్యాటరీలుకంపెనీ నుంచి 244 ఎకరాలు భూములు వెనక్కి ఇవ్వమని నోటీసులు ఇచ్చారని అన్నారు. కృష్ణపట్నం పోర్టు రిలయన్స్‌లో 840 ఎకరాలు ఇలా వివిధ కంపెనీల నుచి భూములు వెనక్కు తీసుకున్నారని అన్నారు. అదేవిధంగా జగన్ కంపెనీల భూములు ఎందుకు వెనక్కు ఇవ్వలేదని ప్రశ్నించారు.
'సాక్షి పేపర్ తనదే అని చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా?' - వాటాల వివరాలు బయటపెట్టిన ఆనం