ETV Bharat / state

' వైఎస్సార్సీపీ తరిమికొట్టేందుకు అంతా కలిసి నడవాలి ' జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం - TDP leaders Election campaign - TDP LEADERS ELECTION CAMPAIGN

TDP Leaders Election Campaign Various District in AP : వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని గద్దెదించడమే ఏకైక లక్ష్యంతో కూటమి అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ బాబు ఘ్యారిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

tdp_leaders_campaign
tdp_leaders_campaign
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 9:36 AM IST

TDP Leaders Election Campaign Various District in AP : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి అభ్యర్థులు ప్రచారంలో జోరు పెంచారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతున్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారెంటి, తెలుగుదేశం సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలు వివరిస్తున్నారు. ప్రచారాల నేపథ్యంలో కూటమిలోకి వైసీపీ నేతలు భారీగా చేరుతున్నారు.

' వైఎస్సార్సీపీ తరిమికొట్టేందుకు అంతా కలిసి నడవాలి ' జోరుగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

Krishna District : రాష్ట్రవ్యాప్తంగా కూటమి అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కృష్ణాజిల్లా గుడివాడ ఫిషర్‌మెన్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో మాజీమంత్రి కొల్లు రవీంద్ర, గుడివాడ కూటమి అభ్యర్థి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. మత్స్యకారుల సమస్యలు విన్న నేతలు తెలుగుదేశం అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విజయవాడ ఎంపీ అభ్యర్తి కేశినేని చిన్ని విస్సన్నపేటలో ప్రచారం నిర్వహించారు. కేశినేని చిన్ని సమక్షంలో భారీగా యువత తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో కూటమి నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవీ ఆంజనేయులు, షరీఫ్ ముస్లిం మైనార్డీ, నూర్‌భాషాలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

'రాష్ట్రం ప్రగతి బాటలో నడవాలంటే చంద్రబాబు సీఎం కావాలి'- ఎన్నికల ప్రచారంలో కూటమి జోరు - TDP Leaders Election Campaign In AP
Bapatla District : బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరంలో తెలుగుదేశం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తనయుడు ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తిరుపతిలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైసీపీని తరిమికొట్టేందుకు అంతా కలిసి నడవాలని పిలుపునిచ్చారు.

Anantapuram District : అనంతపురం జిల్లా ఉరవకొండలోని పలు కాలనీల్లో పయ్యావులు కేశవ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్తూ ప్రజలు సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, కల్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు రోడ్‌ షో నిర్వహించారు. కర్నూలు కూటమి అభ్యర్థి టీజీ భరత్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ సూపర్‌ సిక్స్‌ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంచారు.

'అమ్మా వెళ్లొద్దు- భోజనాలు ఉన్నాయి-ఆగండి' జనాలను నిలువరించేందుకు వైసీపీ ప్రయత్నాలు - YCP LEADER ELECTION CAMPAIGN

Vizianagaram District : విజయనగరం జిల్లా రాజాంలో కూటమి అభ్యర్థి కోండ్రు మురళీమోహన్‌ పలు పంచాయతీల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో వైసీపీ కార్యకర్తలు భారీగా తెలుగుదేశంలోకి చేరారు. వీరందరిని సీనియర్‌ నేత అశోక్‌ గజపతిరాజు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.