TDP Leaders Complaint on YSRCP Election Code Voilation : ఏపీలో పోలీసుల వ్యవహార శైలిలో ఎలాంటి మార్పూ లేదని తెలుగుదేశం నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. మచిలీపట్నంలో అధికార పార్టీ ఎమ్మెల్యే పేర్ని నాని, ఆయన కుమారుడు కిట్టూ పోలీసు స్టేషన్ పై దాడి చేశారని మండిపడ్డారు. అయినప్పటికీ పోలీసులు వారిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోకపోవడంపై మండిపడ్డారు. వారిని తక్షణమే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. దాడి చేస్తే దానిని ఆకతాయితనంతో చేసినట్టు కేసు పెట్టారు. ఇలాంటి తరుణంలో పారదర్శకంగా ఎన్నికలు జరుగుతాయా అని నిలదీశారు. ఓ ఛానల్లో బుల్లెట్ పై తిరుగుతూ ఓ యాంకర్ నోటికొచ్చినట్టు ప్రతిపక్ష నేత గురించి మాట్లాడుతున్నారు. అది పెయిడ్ ఆర్టికల్‌గా పరిగణించాలని కోరారు. ఫ్లయింగ్ స్క్వాడ్‌లో పని చేసే ఓ అధికారి కూడా ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరామన్నారు.
పోలీసులపై రాళ్లదాడి... పలువురికి గాయాలు
Devineni Fires On Perni Nani : ప్రస్తుతం డీజీపీ ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరగవని తమకు అర్థమయ్యిందన్నారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ పోలీసు స్టేషను పై దాడి చేస్తే మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కొడుకు కిట్టూ పేర్లు లేకుండా కేసు పెడతారా అని దేవినేని ఉమా మహేశ్వర రావు ధ్వజమెత్తారు. ఇదెక్కడి న్యాయం, అక్కడ కలెక్టర్, ఎస్పీలు ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఈ తరహాలో వ్యవహరిస్తున్న చోట పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుగుతాయన్నారు. కొన్ని ఛానళ్లలో ప్రసారమవుతున్న పెయిడ్ ఆర్టికల్స్ పై చర్యలు తీసుకోవాలని సీఈఓ ను కోరామన్నారు. ఇబ్రహంపట్నంను వైఎస్సార్సీపీ నేతలు బూడిద పట్నం చేశారని విమర్శించారు.
పోలీస్ స్టేషన్ ముందు పేర్ని నాని వీరంగం- ఎస్ఐ తో దురుసు ప్రవర్తన - Perni Nani threatening SI
YSRCP Leaders Election Code Voilation : ఎన్నికలు కమిషన్ నిబంధనలు బేఖాతరు చేస్తూ ప్రార్థన మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు.
Police Neglect ON YCP Voilation : ఇటీవల అనపర్తి పెదపూడి మండలాల్లోని క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో వైసీపీకి ఓటు వేయమని కోరుతూ ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రార్ధన మందిరాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదని, అయినా వైసీపీ అభ్యర్థి సూర్యనారాయణ రెడ్డి భార్య ఆదిలక్ష్మి క్రైస్తవ ప్రార్థన మందిరాల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రచారం చేసి ఎన్నికల కమిషన్ నిబంధనలను ఉల్లంఘించారన్నారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మచిలీపట్నంలో టీడీపీ, జనసేన శ్రేణుల అరెస్టు - ఉద్రిక్త వాతావరణం