ETV Bharat / state

'విడదల రజిని హింసించారు' - స్టేషన్​లో వేధింపులపై ఫిర్యాదు - COMPLAIN TO SP ON VIDADALA RAJINI

మాజీ మంత్రి విడదల రజిని, ఆమె అనుచరులపై ఎస్పీకి టీడీపీ నేతల ఫిర్యాదు - అక్రమ కేసులతో వేధించారని వెల్లడి

complain_to_sp_on_vidadala_rajini
complain_to_sp_on_vidadala_rajini (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 4:42 PM IST

TDP Leaders Complain to SP Against Vidadala Rajini: అక్రమ కేసులతో వేధించారని వైఎస్సార్​సీపీ మాజీ మంత్రి విడదల రజినిపై పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు చిలకలూరిపేట ఐటీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రితో పాటు ఆమె వ్యక్తిగత సహాయకులు రామకృష్ణ, జయ ఫణీంద్ర కుమార్, గతంలో చిలకలూరిపేట అర్బన్ సీఐగా విధులు నిర్వహించిన సూర్యనారాయణపైనా ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్​సీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక, మార్ఫింగ్ పోస్టులు పెట్టామని తమపై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసు స్టేషన్‌లో తమను అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని వాపోయారు. చిత్రహింసలు పెడుతూ వాట్సప్‌ కాల్‌లో మాజీ మంత్రి విడదల రజిని, ఆమె వ్యక్తిగత సహాయకులకు చూపిస్తూ కొట్టారని ఆరోపించారు. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావును కలిసి చిలకలూరిపేట ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

అంబటి హింట్ ​- 'నా ఇంట్లోనే ఉన్నాడు వచ్చి అరెస్టు చెయ్యండి' - షాకిచ్చిన పోలీసులు

అవినాష్​రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - జల్లెడ పడుతున్న పులివెందుల పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.