TDP Leader Varla Ramaiah Warning to Erring Officers : వైఎస్సార్సీపీ ప్రభుత్వంతో తప్పు చేసిన ఏ అధికారిని వదిలే ప్రసక్తి లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కార్యాలయాల్లోని రికార్డులు తరలించడానికి, మార్చడానికి వీల్లేకుండా ఆర్డర్ ఇవ్వాలని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు. మాచర్ల దాడులు, నరసరావుపేట అఘాయిత్యాలు, చంద్రగిరి హత్యాయత్నాలు, తాడిపత్రి తగులబడడం ఘటనలను గమనిస్తున్నామన్నారు. అధికార మార్పిడి తథ్యమని అధికారులకందరికీ తెలిసిపోయిందని చెప్పారు. కళంకిత అధికారులు ఫైళ్లను సరిదిద్దడం, మార్చడం, ధ్వంసం చేయడం వంటివి చేయొద్దని వర్ల రామయ్య హితవు పలికారు.
మమ్మల్ని తరిమేయడం కాదు - మీ సంగతి చూసుకోండి: సోమిరెడ్డి - tdp leader on ysrcp leaders attacks
తప్పు చేసిన ప్రతి అధికారి తగిన మూల్యం చెల్లించుకోవాలి : అలాగే ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనంతా తప్పులతడకేనని ఆరోపించారు. ఇప్పటివరకు అధికారులు చాలా తప్పులు చేశారని ఆ పార్టీ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో ఏ ఫైల్ క్లోజ్ చేయడానికి వీల్లేదన్నారు. కొంతమంది అధికారులు పోలీస్‌స్టేషన్‌లోని ఎఫ్ఐఆర్లు, కేసు ఫైళ్లు తగలబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక అన్నీ సమీక్ష చేయిస్తామని అన్నారు. తప్పులు చేసి కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేయవద్దని హెచ్చరించారు. తప్పు చేసిన ప్రతి అధికారి తగిన మూల్యం చెల్లించుకోవాలని వర్ల రామయ్య తెలిపారు.
గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి : అలాగే అనంతపురం జిల్లా తాడిపత్రిలో డీఎస్పీ వీఎన్‌కే చైతన్య టీడీపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయటం దారుణమన్నారు. తెలుగుదేశం నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి గృహాన్ని బుధవారం తెల్లవారు జామున ప్రత్యేక బలగాలతో ముట్టడించి వీరంగం సృష్టించారని తెలిపారు. జేసీ ఇంటితో పాటు ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో నిద్రిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఇళ్లపై సైతం విరుచుకుపడ్డం ఎంతవరకు సమంజసమన్నారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో హఠాత్తుగా దాడి చేసి చితకబాదారు. వారు పనివాళ్లా, సిబ్బందా, టీడీపీ వర్గీయులా అన్న తేడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టాడం ఏంటని ప్రశ్నించారు. అలాగే దివ్యాంగుడైన కంప్యూటర్ ఆపరేటర్ కిరణ్ దాడిచేయటం దుర్మమైన చర్యని తెలిపారు. డీఎస్పీ చైతన్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. అతను పెద్దరెడ్డికి వైసీపీ కార్యకర్తల పనిచేశాడని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం రాగానే అరాచకవాదులపై చట్టప్రకారం చర్యలు : అలాగే ఎన్నికల రోజు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాలా దాడులకు పాల్పడ్డారని టీడీపీ నేత యరపతినేని అన్నారు. దాడులు నియంత్రించడంలో ఈసీ, సీఎస్, డీజీపీ విఫలమయ్యరని తెలిపారు. పల్నాడు జిల్లా పోలీసులు ఇంకా వైఎస్సార్సీపీ కనుసన్నల్లో పనిచేస్తున్నారు విమర్శించారు. పిన్నెల్లిలో భారీగా బాంబులు బయటపడ్డాయని తెలిపారు. రాత్రి సమయంలోనే బాంబులు గుర్తించినా పోలీసులు ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు. దాడుల్లో పాల్కొన్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు తప్పిస్తారనే అనుమానంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే అరాచకవాదులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని యరపతినేని స్పష్టం చేశారు.
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో పురోగతి -11 మంది అరెస్ట్ - Nani Case Update 11 Arrest