TDP Leader Sridevi Dead then Attack By Rivals in Allagadda: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తెలుగుదేశం నాయకురాలు అట్ల శ్రీదేవి హత్యకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం శ్రీదేవి ఆమె భర్త భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద ఉండగా ప్రత్యర్థులు కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. దాడిలో ఘటనాస్థలిలోనే శ్రీదేవి మృతి చెందారు. తీవ్రగాయాలైన భాస్కర్ రెడ్డిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా ఆస్పత్రికి చేరుకుని భాస్కర్‌రెడ్డిని పరామర్శించి శ్రీదేవి మృతిపై సంతాపం తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యకు ఆస్తి వివాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన అట్ల భాస్కర్‌రెడ్డి, అతని తమ్ముడు గోపాల్‌రెడ్డికి గత కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. పలుమార్లు ఒకరిపై ఒకరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. సాయంత్రం భాస్కర్‌రెడ్డి, ఆయన భార్య శ్రీదేవి వారి ఇంట్లో ఉండగా గోపాల్‌రెడ్డి, అతని భార్య శిరీష మరికొందరు రాడ్లతో వారి ఇంట్లోకి వెళ్లి దాడి చేశారు. శ్రీదేవి తలపై ఇనుప రాడ్డుతో కొట్టడంతో తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్నారు. భాస్కర్‌రెడ్డి సైతం తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శ్రీదేవి మృతి చెందినట్లు నిర్ధారించారు. భాస్కర్ రెడ్డికీ అతడి సోదరుడితో కొన్ని సంవత్సరాలుగా ఆస్తి వివాదాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
యువతి హత్య కేసులో నిందితులు అరెస్ట్- 48గంటల్లో పట్టుకున్న పోలీసులు - Young Woman Rape Case UPDATES
హత్యకు గురైన శ్రీదేవి ఈ మధ్య జరిగిన ఎన్నికల ప్రచారంలో టీడీపీకి మద్దతుగా చురుగ్గా ప్రచారం నిర్వహించారు. నగరంలో భూమా అఖిలప్రియ వెంట తిరిగి ప్రచారం చేశారు. రాజకీయంగా శ్రీదేవి చురుగ్గా మారడం, అఖిలప్రియ ఎమ్మెల్యేగా గెలవడంతో శ్రీదేవి పలుకుబడి పెరుగుతుందని, ఇది రానున్న రోజుల్లో తమకు ఇబ్బందికరంగా మారుతుందని భావించి ప్రత్యర్థులు ఈమెను అంతమొందించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది. రద్దీగా ఉండే మెయిన్ బజారుకు, పోలీసు పికెట్‌కు 100 అడుగుల దూరంలోనే వారి ఇల్లు ఉన్నా నిందితులు హత్యకు పూనుకోవడం గమనార్హం. హత్యలో పాల్గొన్న ఇద్దరు నిందితులూ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. హత్యను ఇద్దరే చేశారా మరికొందరు సహకరించారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
అసాంఘిక శక్తులకు చంద్రబాబు హెచ్చరిక- మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
బాపట్ల జిల్లాలో దారుణం- యువతి హత్యాచార ఘటనపై సీఎం సీరియస్ - Woman raped in Bapatla district