TDP Leader Nara Lokesh Election Campaign: ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్‌గా చేసే బాధ్యత తీసుకుంటానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన యువగళం సభలో ఆయన ప్రసంగించారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా తాగు, సాగునీరందించే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని లోకేశ్ అన్నారు. పక్క రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి వచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు.
జగన్‌కు భయపడి తల్లి విజయమ్మ అమెరికా వెళ్లారు- నారా లోకేశ్ - Nara Lokesh in Rachabanda
నాడు ఒక్క అవకాశం అని జగన్ మాయలో పడటంతో నేడు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని లోకేశ్ అన్నారు. టీడీపీ తెచ్చిన కంపెనీలు ఇప్పుడు పక్క రాష్ట్రానికి తరలిపోయాయని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నానని లోకేశ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారాలను మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు. టీడీపీ హయాంలో జిల్లాల వారీగా ప్రాధాన్యం కల్పించి నిలిచిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. కూటమి వచ్చిన వంద రోజుల్లో పెట్టుబడులకు పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. బ్యాండేజ్ బాబు అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని జగన్ పై మండిపడ్డారు.
గతంలో కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఫీజ్ రియాంబర్స్‌మెంట్ ఇవ్వడంతో విద్యార్థులు చక్కగా చదువుకొనేవారని లోకేశ్ అన్నారు. ఇప్పుడు ఒక దఫా వేస్తే, మరో దఫా వేయడంలేదని విమర్శించారు. ఫీజులు చెల్లించలేదని హాల్‌టికెట్ ఇవ్వకపోవడంతో పరీక్షలు రాయలేని పరిస్థితి నెలకొందని లోకేశ్ అన్నారు. ఇలాంటి చదువులు వల్ల విద్యార్థులు భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే పాత ఫీజ్ రియార్స్‌మెంట్ విధానాన్ని యథాతధంగా అమలు చేస్తామన్నారు.
యువతతో నారా లోకేష్ ముఖాముఖి సభలు- ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన
"ప్రజల కోసం పోరాడినందుకు నాపై 23 కేసులు పెట్టారు. మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. వైసీపీ చేసిన తప్పులను ప్రజల ముందుంచాం. సమర్థ నాయకత్వం అందించే అభ్యర్థులను గెలిపించాలి. తప్పు చేసిన అధికారులను ఉపేక్షించేది లేదు. చట్టాలను కొంత మంది చుట్టాలుగా మార్చారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులను వదిలిపెట్టేది లేదు. వారి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయి. అభివృద్ధి ద్వారా వచ్చే ఆర్థిక వనరులను పేదలకు ఖర్చు పెడతాం. టీడీపీ హయాం నాటి పథకాలను వైసీపీ రద్దు చేసింది. రద్దు చేసిన సంక్షేమ కార్యక్రమాలను తిరిగి ప్రారంభిస్తాం’’ అని లోకేశ్ భరోసా కల్పించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ చేసిన పాదయాత్రకు ఎక్కడా చిన్న ఆటంకం కూడా కలగకుండా భద్రత కల్పించారు. అలాంటిది తాము చేసే యాత్రలు, సభలపైన కొత్త చట్టాలు తీసుకువచ్చి ఇబ్బందులకు గురిచేశారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మీ బిడ్డను మీ బిడ్డను అన్నప్పుడే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై డౌటొచ్చింది: నారా లోకేష్