ETV Bharat / state

జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల్లో నగదు మాత్రమే- నో డిజిటల్ పేమెంట్స్: గంటా

TDP leader Ganta Srinivas Rao Reacts On liquor scandal: ఏపీలో మద్యం అక్రమాలపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. ప్రపంచం మెుత్తం డిజిటల్ పేమెంట్ వైపు నడుస్తుంది కానీ, ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు నో ఛాన్స్! అంటూ ఎద్దేవా చేశారు. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం ను చూపిస్తూ 15 ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని విమర్శించారు.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 4:45 PM IST

TDP leader Ganta Srinivas Rao Reacts On liquor scandal: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం హామీని తుంగలో తొక్కిందని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్రంలో జరుగుతున్న మద్యం అక్రమాలపై ఎక్స్ (ట్విట్టర్) ద్వారా స్పందించారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయానికి సంబంధించి లెక్కలు, పత్రాలపై ప్రశ్నించారు. మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్, మద్యం ద్వారా వచ్చే ఆదాయన్ని చూపిస్తూ 15 ఏళ్లకు బ్యాంకు నుంచి అప్పులు తెచ్చారని గంటా ఆరోపించారు.
జగనాసుర కుట్రలో భాగంగానే చంద్రబాబును ఏ3గా చేర్చారు: నారా లోకేశ్

లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా?: టీ స్టాల్ దగ్గర నుంచి, కిళ్ళీ కొట్టు వరకు అన్నిచోట్ల డిజిటల్ పేమెంట్ ప్రపంచం నడుస్తుందని కానీ, ఏపీలో మాత్రం జగన్మోహన్ రెడ్డి నడిపే మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ కు నో ఛాన్స్! అని మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. అంతా క్యాష్ మయం! ఏంటి ఈ రహస్యం? ఈ క్యాష్ అంతా ఎక్కడికి చేరుతుంది, వీటికి లెక్కా పత్రాలు ఏమైనా ఉన్నాయా జగనన్న అని ప్రశ్నించారు. ఇంత విచ్చలవిడిగా నాసిరకం మద్యం అమ్మి, పేదోడిని దోపిడీ చేసిన ఇలాంటి ముఖ్యమంత్రి చరిత్ర తిరగేసినా దొరకరేమో అంటూ గంటా ఎద్దేవా చేశారు. రేట్లు సంగతి దేవుడెరుగు, బ్రాండ్‌లన్నీ బ్రాంతియేలా మార్చారన్నారు. ప్రీమియం పేరును మాయం చేశారు, నిఖార్సైన సరుకుకు ఏనాడో స్వస్తి పలికారని విమర్శించారు.
లెక్కలు తారుమారు చేసేందుకు వెబ్​సైట్ నుంచి లిక్కర్ డేటా తొలగింపు: అచ్చెన్నాయుడు

35 లక్షల మందిని రోగాల బారిన పడ్డారు: ఐదేళ్ళుగా 'J' బ్రాండులతో హానికర కిక్‌ను నింపారని గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మద్య నిషేధం చేసి ఓటు అడుగుతానన్న హామీకి విరుద్ధంగా మద్యం ఆదాయం ను చూపిస్తూ 15 ఏళ్లు బ్యాంకులకు తాకట్టు పెట్టిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. నాసిరకం మద్యం వల్ల 35 లక్షల మందిని రోగాల బారిన పడ్డారుని ఆరోపించారు. అందులో 30 వేల మంది ప్రాణాలు పోయాయని ఆరోపించారు. మద్యంతో దోపిడీ చేస్తూ వారి ఆరోగ్యం తో చెలగాటం ఆడుతూ 'జగనన్న సురక్ష' అంటూ మళ్ళీ ప్రజల వద్దకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. అమ్మఒడి పేరుతో ప్రభుత్వం వేస్తున్న డబ్బులకు, నాన్న బుడ్డికి లెక్కతో సరి చేస్తున్నారని గంటా ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారిస్తూ కల్తీ మద్యానికి ఇష్టానుసారంగా రేట్లు పెట్టి పేదోడిని దోపిడీ చేస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి అదే పేదోడు సిద్దం గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారూ అంటూ గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

6, 7, 10 ర్యాంక్​లు కాదు - మద్యం పార్టీ చేసుకున్న విద్యార్థుల తరగతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.