ETV Bharat / state

తాడేపల్లి పీఎస్‌లో సజ్జలపై టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు - Devineni Uma complaint on Sajjala

Devineni Uma complaint on Sajjala: నిబంధనలు పాటించే వాళ్లు కౌటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదన్న సజ్జలపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న సజ్జలను వెంటనే అరెస్ట్ చేయాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం సైతం సజ్జల వ్యాఖ్యలపై చర్యలు చేపట్టాలని కోరారు.

Devineni Uma complaint on Sajjala
Devineni Uma complaint on Sajjala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 2:45 PM IST

Updated : May 30, 2024, 3:00 PM IST

Devineni Uma complaint on Sajjala: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై తాడేపల్లి పీఎస్‌లో తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. బుధవారం జరిగిన వైఎస్సార్సీపీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్ల సమావేశంలో సజ్జల చేసిన ఆరోపణలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. నిబంధనలు పాటించేవాళ్లు కౌంటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సజ్జల వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

నిబంధనలు పాటించే వాళ్లు కౌటింగ్ ఏజెంట్లుగా తమకు అవసరం లేదన్న సకలశాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘం తక్షణమే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు తమకు అవసరం లేదని, టీడీపీ-జనసేన ఏజెంట్లకు అడుగడుగునా అడ్డం పడాలని సజ్జల హితబోధ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఓటమి భయంతో పోలింగ్ రోజున రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. ఓటమి ఖాయమవడంతో లండన్ లో జగన్ రెడ్డి టీవీలు బద్దలు కొడుతున్నాడని అన్నారు. జగన్మోహన్ రెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి డైరెక్షన్ లోనే సజ్జల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు. సీఎస్ పదవికి మచ్చ తెచ్చిన జవహర్‌ రెడ్డిని తక్షణమే పదవి నుంచి తప్పించాలని దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

రూల్‌ కాదని వెనెక్కి తగ్గేవారు కౌంటింగ్‌ ఏజెంట్‌గా వద్దు : సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జల వ్యాఖ్యలు: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్లకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్ల అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మన టార్గెట్‌ ఇదీ అని దృష్టిలో పెట్టుకుని దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. వారనుకున్నట్లుగా అడ్డం కొట్టకుండా ఆపేందుకు ఏమేం రూల్‌ పొజిషన్‌ ఉన్నాయో చూసుకోవాలని సజ్జలు వ్యాఖ్యానించారు. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏమేం చేయాలనేది చూసుకోవాలి. అంతే తప్ప రూల్‌ అలా ఉంది కాబట్టి దాని ప్రకారం పోదామని మనం కూర్చోవట్లేదని వెల్లడించారు. మనకు అనుకూలంగా అవతలి వాడి ఆటలు సాగకుండా రూల్‌ని ఎలా చూసుకోవాలి? అవసరమైతే దానికోసం ఎంతవరకు ఫైట్‌ చేయాలనేది నేర్చుకుందామని తెలిపారు. ఇందులో కౌంటింగ్‌ ఏజెంట్‌ తన వంతు పాత్ర పోషించేటట్లు వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలని చీఫ్‌ కౌంటింగ్‌ ఏజంట్లనుద్ధేశించి సజ్జలు అన్నారు.

పొరపాటున ఒకటి మనం వాదించినా పర్లేదు. కానీ, రూల్‌ కాదేమో అని వెనక్కు తగ్గేవాడైతే ఏజెంట్‌గా వద్దని పునరుద్ఘాటించారు. అవతల మన ప్రత్యర్థి ధర్మయుద్ధం చేసేవారు కాదు. వారికి తెలిసిన విద్య అడ్డంగా కొట్టడం, అది ఈసీ రూపంలో కావచ్చు ఇంకోటి కావచ్చు గమనిస్తూనే ఉన్నామని శ్రేణులకు పిలుపునిచ్చారు. వారి ఆటలు సాగనివ్వకుండా ఎలా చేయాలనేదే మన టార్గెట్‌. మళ్లీ బ్రహ్మాండంగా అధికాంలోకి వస్తున్నామని తెలిపారు.

పిన్నెల్లి దౌర్జన్యాలకు పోలీసులు దన్నుగా నిలిచారు - డీజీపీకి దేవినేని ఉమ లేఖ - TDP Leaders on pinnelli Issue

Last Updated : May 30, 2024, 3:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.