TDP Government Reopen For Nellore Park: వైఎస్సార్సీపీ ప్రభుత్వం కక్ష సాధింపులో భాగంగా ఐదు సంవత్సరాల క్రితం తాళాలు పడిన నెల్లూరు పార్కు గేట్లు ఎట్టకేలకు తెరుచుకున్నాయి. పర్యాటకుల రాకపోకలు మొదలయ్యాయి. ఐదు సంవత్సరాలు అనాథగా ఉన్న పార్కు ఇప్పుడు ఇంటిల్లిపాదికీ ఆహ్లాదం పంచుతోంది. నెల్లూరుకు పది కిలోమీటర్లు దూరంలో ఉన్న పార్కు పర్యాటకులకు అందుబాటులోకి రావటానికి ఐదు సంవత్సరాలు పట్టింది.
విహార యాత్రలో విషాదం - వంజంగి కొండల్లో గుండెపోటుతో పర్యాటకుడు మృతి
2015లో అప్పటి పురపాలకశాఖ మంత్రి నారాయణ పార్కుకి శంకుస్థాపన చేశారు. 100 ఎకరాల్లో నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసి అటవీ భూములను అభివృద్ధి చేయించి వేల మెుక్కలు నాటించారు. 2019 నవంబర్‌లో నారాయణే ఈ పార్కును ప్రారంభించారు. పర్యాటకులకూ ప్రవేశం కల్పించారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్కుకి తాళాలు వేసింది. ఐదు సంవత్సరాలుగా కళ తప్పిన పార్కులో మళ్లీ పర్యాటక సందడి మొదలైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్కును తెరిపించి పర్యాటకుల్ని అనుమతిస్తోంది.
రాష్ట్ర రహదారి కలిసే విధంగా అటవీశాఖ భూములను అభివృద్ధి చేయడం, పచ్చదనం పెంచడం ప్రధాన లక్ష్యంగా వేలాది మొక్కలను నాటారు. పార్కు పనులు పూర్తి చేసి ప్రారంభించారు. పర్యాటకులు సందడి చేస్తున్న కొద్ది రోజులకే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రావడంతో తాళాలు వేశారు. విశాలమైన అటవీ భూముల్లో చుట్టూ కంచె ఏర్పాటు చేశారు.
పార్కులో పర్యాటకులను కనువిందు చేసేలా పలు రకాల జంతువుల బొమ్మలు, పూల మెక్కలు అటవీ అందాలు వీక్షించేలా, వంద అడుగుల ఎత్తులో వ్యూ పాయింట్ రూపొందించారు. అక్కడి నుంచి చూస్తే నెల్లూరు చుట్టూ ఉన్న గ్రామాలు, పచ్చదనం, చెరువులు అందంగా కనిపిస్తాయి. చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఊయలలు, అడ్వంచర్ థీమ్స్ ఏర్పాటు చేశారు. ఐదు సంవత్సరాలుగా ఇవన్నీ మిస్ అయ్యామని పర్యాటకులు చెప్తున్నారు. సెలవు, పండగ రోజుల్లో కుటుంబాలతో ఇక్కడికి వస్తామని పర్యాటకులు చెబుతున్నారు.
ఇప్పటికైనా పర్యాటకులకు అనుమతి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని వారు చెబుతున్నారు. పార్కులో భోజన క్యాంటీన్లతోపాటు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని పర్యాటకులు కోరుతున్నారు. ఇటీవల అటవీ శాఖ అధికారి చంద్రశేఖర్ రెండు కోట్ల రూపాయలు పనులు చేయించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోగా మరో ఐదు కోట్లకు ప్రతిపాదనలు పంపించారు.
అరకులోయలో పర్యాటకుల సందడి - మండుటెండల్లోనూ పొగమంచు అందాలు