TDP Government is Working to Develop Chittoor District Industrial : ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రెండున్నర నెలలకే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీని సందర్శించి 15 పరిశ్రమలు ప్రారంభించారని మంత్రి టీజీ భరత్ అధికారులతో అన్నారు. ఇదే స్పూర్తిని పారిశ్రామిక వేత్తల్లో నింపే చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. పలు కంపెనీల సీఈవోలతో సమావేశమై పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను వివరించారు.
గంగాధరనెల్లూరులో అత్యధికంగా 15 : జిల్లాలోని పారిశ్రామిక పార్కుల్లో 23 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 63 ఎకరాలు అందుబాటులో ఉంది. అత్యధికంగా గంగాధరనెల్లూరులో 4 ఎకరాల్లో 15 ప్లాట్లలో పరిశ్రమలు స్థాపించవచ్చు. నగరి, గండ్రాజుకుప్పంలో ఒక్కోటి, చిత్తూరు నగరంలోని తిమ్మసముద్రం, మురకంబట్టు, పుంగనూరు మండలం మిట్టచింతళవారిపల్లిలో రెండు చొప్పున ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మిట్టచింతళవారిపల్లిలో 36 ఎకరాలు ఎకరాల్లో పరిశ్రమలు నెలకొల్పవచ్చు.
ప్రోత్సాహకాలు సక్రమంగా ఇవ్వకనే : వైఎస్సార్సీపీ హయాంలో పారిశ్రామిక రంగంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాలూ ఇవ్వకపోవడంతో ఉన్న పరిశ్రమలే మూతపడ్డాయి. జీడీనెల్లూరులో ఇలాగే కొన్ని యూనిట్లు కార్యకలాపాలు నిలిపేశాయి. ఏపీఐఐసీ ప్లాట్లను లీజు ప్రాతిపదికన కేటాయించారు. ఔత్సాహికులను ఇది మరింత నిరుత్సాహపరిచింది. భూమి కొనుగోలుకు డబ్బులు ఖర్చు చేయడంతోపాటు యూనిట్ స్థాపించేందుకూ సొంతంగానే వనరులు సమకూర్చుకోవాల్సిన దుస్థితి ఎదురైంది. గతంలో భూమిని హామీగా చూపి బ్యాంకు నుంచి రుణం తీసుకునే పరిస్థితి ఉంది. ఇందుకు భిన్నమైన విధానాన్ని వైఎస్సార్సీపీ అనుసరించింది.
పీపీ విధానంలో కల్పించాలని : జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో గతంలో ఏర్పాటైన పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సదుపాయాల పరంగా ఇబ్బందులున్నా పట్టించుకోలేదు. అంతర్గత రహదారులు, విద్యుత్తు, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిన్నా నిర్లక్ష్యంగానే వ్యవహరించారు. ఇప్పుడు వీటన్నింటినీ సరిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారు. సర్కారే సొంతంగా లేదంటే ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో సౌకర్యాలు కల్పించాలని భావిస్తున్నారు. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రానుంది.
కుప్పంపై ప్రత్యేక దృష్టి : కుప్పం నియోజకవర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో ఇక్కడ నూతన పారిశ్రామిక పార్కు ఏర్పాటును ప్రాధాన్య అంశంగా తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి సూచించారు. మెగా ఫుడ్ పార్క్, ఆటోమొబైల్ పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
సూర్యలంక బీచ్‌కు మహర్దశ - రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన కేంద్రం - Suryalanka Beach Development