ETV Bharat / state

సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను పెంచండి- ఈసీని కలిసిన కూటమి నేతలు - TDP BJP leaders met EC - TDP BJP LEADERS MET EC

Polling center security in Rayalaseema: రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని ఎన్డీయే కూటమి నేతలు సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరారు. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్‌ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. వీటిని క్రిటికల్‌ సెన్సిటివ్‌ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారన్నారు.

Polling center security in Rayalaseema
Polling center security in Rayalaseema (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 12, 2024, 8:22 PM IST

Polling center security in Rayalaseema: రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పలు ప్రాంతాల్లో పోలింగ్ నిర్వాహణకు భద్రత పెంచాలంటూ కూటమి నేతలు ఏపీ ఈసీ, సీఐఓ ముఖేష్ కుమార్ మీనాను కలిశారు. ఆయా ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లల్లో లోపాలపై చర్యలు చేపట్టాలని వినతి పత్రం ఇచ్చారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఎన్నికల నిర్వాహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందుకోసం ప్రత్యేక బలగాలను కేటాయించాలని మీనాను కూటమి నేతలు కోరారు.

రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని కూటమి నేతలు కోరారు. రాయలసీమలోని ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. వీటిని క్రిటికల్ సెన్సిటివ్ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారన్నారు. ధర్మవరం కూటమి అభ్యర్ధి సత్యకుమార్ మరిన్ని కేంద్ర బలగాలను మోహరించాలని హైకోర్టులో కేసు వేశారని బీజేపీ నేత సాధినేని యామినీ శర్మ తెలిపారు. కోర్టు తీర్పు సారాంశాన్ని ఎన్నికల ప్రధానాధికారికి నివేదించామన్నారు.

జగన్​కు దారుణ పరాభవం - ఆ మంత్రి గెలిచినా టీడీపీలోకి వెళ్తాడు - పీకే మరో సంచలన ఇంటర్వ్యూ - Prashant kishor on ap elections

రాయలసీమలో ఇబ్బంది ఉందనే ప్రశాంతంగా పోలింగ్ జరిగేందుకు భద్రత పెంచాలని కోరినట్లు బీజేపీ నేతలు వెల్లడించారు. భద్రత పెంచే విషయంపై డీజీపీకి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చారన్నారు. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి బెదిరింపులకు దిగుతున్నారని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి భద్రత కోసం కోర్టుకు వెళ్లామని బీజేపీ నేత కిలారు దిలీప్ వివరించారు. సాయుధ బలగాలను కేటాయించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని డీజీపీని కూడా కోరామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెడుతున్నామని ఈసీ వెల్లడించారని తెలిపారు. భద్రత కల్పించే విషయంలో హైకోర్టు ఉత్తర్వులను సీఈఓకి అందించామన్నారు. ధర్మవరం , జమ్మలమడుగు, బద్వేల్ నియోజక వర్గాల్లో కేంద్ర బలగాలు మోహరించాలని కోరామన్నారు.

74శాతం పోలింగ్ కేంద్రాల్లో కెమెరాలు-​ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే సమాచారం ఉంది!: ముఖేశ్ కుమార్ మీనా - Mukesh Kumar Meena

'రాయలసీమ జిల్లాల్లోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయుధ బలగాలను పెంచాలని సీఈవో ముకేశ్‌ కుమార్‌ మీనాను కోరాం. ధర్మవరం, జమ్మలమడుగు, బద్వేల్‌ నియోజకవర్గాలు సమస్యాత్మకంగా ఉన్నాయి. వీటిని క్రిటికల్‌ సెన్సిటివ్‌ నియోజకవర్గాలుగా ఇప్పటికే గుర్తించారు. కేంద్ర బలగాలను మోహరించాలని ధర్మవరం కూటమి అభ్యర్థి సత్యకుమార్‌ హైకోర్టులో కేసు వేశారు. కోర్టు తీర్పు సారాంశాన్ని ఎన్నికల ప్రధానాధికారికి నివేదించాం. భద్రత పెంచే విషయమై డీజీపీకి సైతం ఇప్పటికే వినతిపత్రం ఇచ్చాం. రాయలసీమలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి అధికార పార్టీ నేతలు ప్రలోభాలకు దిగుతున్నారు.' - సాదినేని యామినీ శర్మ, బీజేపీ నేత

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఈసీ చర్యలు - మరికొందరిపైనా కొరడా - CEO ACTION AGAINST NANDYALA SP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.