Tax Problems in Vijayawada : ఆకాశన్నంటుతున్న ధరలు ఓ వైపు. ఎడాపెడా ఛార్జీలతోపాటు పన్నుల పోటు మరోవైపు. మోయలేని భారాలతో పేదలకు పూట గడవడమే కష్టమవుతోంది. పోనీ కుటుంబ పోషణ కోసం కూలీకి పోదామన్నా వేతన జీవులకు చేతినిండా పని దొరకడం లేదు. జగన్ ప్రభుత్వ విధానాలతో భవన నిర్మాణ, ముఠా కార్మికులు, హమాలీలకు ఉపాధి కరవై పస్తులుండాల్సి వస్తోంది.
Taxes Burden On Laborers : జగన్ ఏలుబడిలో భవన నిర్మాణ కార్మికులు, హమాలీలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక, చేసిన పనికి తగిన వేతనం రాక రోజు కూలీలు అల్లాడిపోతున్నారు. దీనికి తోడు నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. బాదుడే బాదుడు అంటూ విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల నడ్డివిరుస్తోంది ప్రభుత్వం (Government). వీటికి తోడు అదనంగా వివిధ రూపాల్లో పన్నుల (Tax) భారాలు సామాన్యులకు శాపంగా మారాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 10 వేల మంది ముఠా కార్మికులు, హమాలీలు పని చేస్తున్నారు. ఏళ్లు గడుస్తున్నా వేతనాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు.
నగర వాసులపై పన్నుల భారం- ఆర్థిక ఇబ్బందుల్లో సామాన్యులు
'ఎలా బతకాలి ఒంటిమీద బట్టలు తప్ప మాకేమీ లేదు. జగన్ ఏలుబడి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా ఏనాడూ మా కష్టాలేంటని కనుక్కోలేదు. ఖర్చులు పెరిగి, పన్నులూ పెంచి మా జీవితాల్లో మరింత చీకటి నింపుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు చెమటోడ్చి పని చేసినా మాకు వచ్చేది 600 రూపాయలు మాత్రమే వాటిలోనూ కోతలు ఉంటాయి. ఇంటికి ఖాళీ చేతులలో వెళ్లే గతి పట్టింది. ప్రభుత్వం స్పందించి మమ్మల్ని ఆదుకోవాలి.' -వెంకటరావు, హమాలీ
నగరవాసులపై ఎడాపెడా పన్నుల మోత- 'ఎన్నికల్లో జగన్ సర్కార్కు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరిక'
People Facing Tax Problems in Ap : మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉపాధి లేక కార్మికులు, కూలీలు అవస్థలు పడుతుంటే పన్నుల భారం వారిని మరింత కష్టాల్లోకి నెట్టింది. విజయవాడ నగరపాలక సంస్థ ప్రజలపై యూజర్ ఛార్జీల పేరుతో చెత్త పన్ను, ఇంటి పన్నుతో మోత మోగిస్తోంది. పన్నులు విపరీతంగా పెంచినా దానికి తగ్గట్లు పారిశుద్ధ్య నిర్వహణ చేయడం లేదు. దోమలు, ఈగలతో జనం అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ (YSRCP) హయాంలో పన్నుల బాదుడే తప్ప అభివృద్ధి లేదంటూ నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్నడూలేని విధంగా పన్నులు విధిస్తున్న వైసీపీ- భారం తగ్గించే పార్టీకే మద్దతు: ట్యాక్స్ పేయర్స్