ETV Bharat / state

సీడ్స్‌ షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు - నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు - FAKE SEEDS IN TELANGANA - FAKE SEEDS IN TELANGANA

Fake Seeds in Telangana : విత్తనాల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్న సర్కార్‌ ఆదేశాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీస్‌, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విత్తనాల దుకాణాలు, సీడ్స్‌ నిల్వ గోదాములు తనిఖీలు చేస్తున్నారు. డిమాండ్‌ ఉన్న విత్తనాలు బ్లాక్‌ మార్కెట్‌కు తరలించడం సహా, నకిలీ విత్తనాలు రైతులకు అంటగడితే కఠినచర్యలు తీసుకుంటామని దుకాణాదారులను హెచ్చరిస్తున్నారు. మరోవైపు విత్తనాలు సరిపడా అందుబాటులో ఉన్నాయని రైతులు ఆందోళన చెందొద్దని అధికారులు సూచిస్తున్నారు

Task Force Officers Inspect Seed Shops
Task Force Officers Inspect Seed Shops (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 31, 2024, 7:51 PM IST

సీడ్స్‌ షాపులపై అధికారులు ఆకస్మిక దాడులు - నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు (ETV Bharat)

Task Force Officers Inspect Seed Shops in Telangana : నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ శుభవార్త అందించింది. దీంతో అన్నదాతలు సాగుకు సన్నద్ధమవుతున్నారు. పంట ప్రణాళిక మేరకు విత్తనాలు సమకూర్చుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదే క్రమంలో పలు జిల్లాల్లోని విత్తన దుకాణాల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆదిలాబాద్‌లో విత్తన నిల్వ గోదాములు, దుకాణాలను కలెక్టర్‌ పరిశీలించారు. జూన్‌ 2న తర్వాత రైతులు కోరిన అన్ని రకాలు విత్తనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో కలెక్టర్‌ రాజీవ్‌ హన్మంతు తనిఖీలు నిర్వహించారు. రైతులకు బిల్లులివ్వని ఓ షాపు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటక, కర్నూలు తదితర ప్రాంతాల నుంచి నకిలీ విత్తనాలు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు వికారాబాద్‌ కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. విత్తనాల కొరతపై అసత్య ప్రచారాలను నమ్మొద్దని నల్గొండ కలెక్టర్‌ దాసరి హరిచందన సూచించారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న ఇద్దరు డీలర్లపై పీడీ యాక్ట్‌ కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మితే వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోల్ ప్రీ నంబరు డయల్‌ చేయాలని తెలిపారు.

"ఫెర్టిలైజర్‌ అండ్‌ సీడ్స్‌ షాపుకు సంబంధించి గూడౌన్స్‌లో రెవెన్యూ అధికారి, ఒక పోలీసు అధికారిని ఉంచడం జరిగింది. షిఫ్టుల వారిగా వారు అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఎందుకు పెట్టామంటే రైతులకు విత్తనాలు కచ్చితంగా చేరాలి. ఎక్కడైనా పక్కదారి పట్టకూడదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. పది నుంచి 15 రోజులు పత్తి విత్తనాల విక్రయాలు ఉంటాయి." - రాజర్షి షా, ఆదిలాబాద్ కలెక్టర్

రాష్ట్రంలో నకిలీ విత్తనాలు అరికట్టడం సహా డిమాండ్‌ ఉన్న విత్తనాలను బ్లాక్‌ మార్కెట్‌కు తరలించకుండా చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో టాస్క్‌ఫోర్స్‌ బృందాలు ఏర్పాటు చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని ఎరువులు, విత్తనాల దుకాణాలపై టాస్క్‌ఫోర్స్ బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఎరువులు, విత్తనాల నిల్వలు, రికార్డులు, రశీదు పుస్తకాలు పరిశీలించారు.

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో రైతులు, ఫెర్టిలైజర్‌ షాపుల యజమానులకు నకిలీ విత్తనాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎలాంటి అనుమానం వచ్చిన విత్తనాలను పరిశీలించి ఒకవేళ ఏదైనా తప్పు తేలితే ఆ షాపును క్లోజ్‌ చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేశ్‌ తెలిపారు. హైబ్రిడ్‌ విత్తనాలు అన్ని మంచివేనన్న అధికారులు, నేల స్వభావానికి అనుగుణంగా ఎంచుకోవాలని సూచించారు. విత్తనాల దొరుకుతాయో లేదోనని ఆందోళన చెందొద్దని రైతులకు సూచిస్తున్నారు.

మార్కెట్ నిండా నకిలీ విత్తనాలు - రైతన్నా!! జర జాగ్రత్త - FAKE SEEDS SALES IN TELANGANA

కల్తీ విత్తనాలకు చెక్‌ పెట్టడంపై ప్రభుత్వ ఫోకస్ - మరి కొత్త విధానమైనా వీటిని ఆపేనా? - FAKE SEEDS in TELANGANA

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.