Talliki Vandanam Scheme 2024: తల్లికి వందనం పథకం సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమేనని అన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటి వరకూ, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో చేసే దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోన శశిధర్ కోరారు.
ఆధార్ చట్టం 2016 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల పథకాల లబ్దిదారులను గుర్తించేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉందని పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. అనంతరం ఆధార్ ప్రాధికార సంస్థ నుంచి కావాల్సిన అనుమతులు వస్తాయని అన్నారు. దీనికి అనుగుణంగానే కమిషనర్, పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలతో ఆధార్‌ను వినియోగించేలా గెజిట్ పబ్లికేషన్ జారీ అయిందని పేర్కొన్నారు.

ఆ ప్రచారం అవాస్తవం: అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య మాత్రమే అని వివరిస్తూ ప్రకటన జారీ చేశారు. తల్లికి వందనం పథకం సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇంకా ఖరారు చేయలేదని స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటివరకూ, ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమేనని తెలిపారు. సామాజిక మాధ్యమాలలో ఈ జీవోని చూపిస్తూ 'తల్లికి వందనం' పథకం పేరిట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కోన శశిధర్ స్పష్టంచేశారు.