ETV Bharat / state

బావర్చి హోటల్​లోనూ అదే తీరు - బిర్యానీ తింటుండగా ట్యాబ్లెట్ ప్రత్యక్షం - TABLET IN BAWARCHI BIRYANI

హైదరాబాద్‌ బావర్చి హోటల్‌ బిర్యానీలో మాత్ర - హోటల్‌ ప్రతినిధులను నిలదీసిన వినియోగదారులు - ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 7, 2024, 8:05 AM IST

Tablet in Bawarchi Biryani : బిర్యానీ అంటే చాలా మందికి ఇష్టం. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఉద్యోగం వచ్చినా, ఇలా సందర్భం ఏదైనా బిర్యానీ ఉండాల్సిందే. కొంతమంది బిర్యానీ రోజూ పెట్టినా వద్దనకుండా తింటారు. కానీ ఇటీవల కాలంలో హోటళ్లలోని ఘటనలు చూస్తుంటే బిర్యానీ తినాలంటేనే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే బిర్యానీలో బొద్దింకలు, బల్లులు, జెర్రులు, ఎలుకలు వచ్చిన ఘటనలు చాలానే చూశాం. దాంతో పాటు సిగరెట్ పీకలు కూడా ప్రత్యక్షమైన సందర్భాలున్నాయి. తాజాగా ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా ట్యాబ్లెట్ దర్శనమిచ్చింది.

బావర్చి హోటల్‌ బిర్యానీలో మాత్ర : ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని బావర్చి బిర్యానీ అంటే ఎంతో ఫేమస్. అక్కడ బిర్యానీ తింటే ఆ రుచే వేరు. కానీ తాజాగా బిర్యానీలో గోలీ (ట్యాబ్లెట్) రావడంతో వినియోగదారులు ఆశ్యర్యపోతున్నారు. దీన్ని బిర్యానీ అరగడం కోసం వేశారా అని కామెంట్​లు చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని బావర్చి హోటల్‌లో గురువారం రాత్రి బిర్యానీ తింటున్న ఓ వ్యక్తి పల్లెంలో మాత్ర వచ్చింది. దానిపై వినియోగదారులు హోటల్‌ ప్రతినిధులను నిలదీశాడు. దీంతో సిబ్బంది ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

దీంతో ఈ వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్న హోటల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌లో తనిఖీ చేశారు. గోలీ కనిపించిన పల్లెంలోని బిర్యానీని అప్పుడే చెత్త డబ్బాలో పడేసినట్లు అధికారులకు నిర్వాహకులు చెప్పారు. అయినప్పటికీ శుక్రవారం కూడా నమూనాను తీసుకుని ప్రయోగశాలకు పంపించామని బల్దియా అధికారులు తెలిపారు.

కనీస శుభ్రత పాటించని హోటళ్లు : ఇటీవల ఆహార భద్రతా అధికారులు పలు హోటళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ప్రమాణాలు పాటించని హోటళ్లకు నోటీసులు జారీ చేస్తూ సీజ్​ చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని హోటళ్ల తీరును చూసి అధికారులు షాక్​కు గురవుతున్నారు. కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే, పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హోటళ్లు మరికొన్ని. ఇవన్నీ చూశాక ప్రజలు బయట ఫుడ్ తినాలంటేనే జంకుతున్నారు. ఒకపూట కడుపు మాడ్చుకున్నా సరే కానీ ఇంటికెళ్లి వండుకుని తినాలనుకుంటున్నారు.

అల్వాల్​లోని ఓ హోటల్​లో బిర్యానీలో బొద్దింక - కిచెన్​లోకి వెళ్లి చూస్తే!

చికెన్​ బిర్యానీలో కప్ప - కంగుతిన్న గచ్చిబౌలి ట్రిపుల్​ ఐటీ విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.