ETV Bharat / state

ప్రజలకు జవాబివ్వడంలో నిర్లక్ష్యం వద్దు - మానవత్వంతో సమస్యల్ని పరిష్కరించాలి: చంద్రబాబు - VISION 2047 DOCUMENT LAUNCH

ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ - కలెక్టర్లు మెరుగైన విధానాలను అవలంబించాలి - కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

CM Chandrababu on Swarnandhra Vision-2047
CM Chandrababu on Swarnandhra Vision-2047 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 5:35 PM IST

CM Chandrababu on Swarnandhra Vision-2047 : ఈ నెల 13న స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్ ఆవిష్కరించబోతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. జీఎస్డీపీ వృద్ధి దిశగా అంతా కలిసి కట్టుగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. వచ్చే ఏడాది నుంచి వృద్ధి రేటు రెండు అంకెల్లో ఉండాలని కలెక్టర్ల సదస్సులో స్పష్టం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు హెల్దీ, వెల్దీ, హ్యాపీ అనే విధానాలకు అనుగుణంగా కలెక్టర్లు కార్యాచరణ చేపట్టాలని సూచించారు.

జీరో పావర్టీ లక్ష్యంగా ఆర్ధిక అసమానతలు తగ్గేలా ఎక్కడికక్కడ ప్రణాళికలు చేసుకోవాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో పాటు నదుల అనుసంధానంపై కూడా దృష్టి పెట్టాలని తేల్చి చెప్పారు. కలెక్టర్ల సమర్థతతోనే ప్రజలకు మెరుగైన పాలన అందుతుందన్నారు. పాలనలో చేసే మెరుగైన విధానాలను కలెక్టర్లు పలు చోట్ల అవలంబించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలో 50 లక్షల మందికి చెందిన సమాచారం లేదని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 5.4 కోట్ల మంది జనాభాకు గానూ కేవలం 4.9 కోట్ల మంది వివరాలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. 50 లక్షల మంది పౌరుల సమాచారం ప్రభుత్వం వద్ద లేదని ప్రకటించారు. పురపాలక, రెవెన్యూ, రవాణా, విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన వివిధ శాఖల్లో వీరి సమాచారమే లేదని స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ : గతంలో చేపట్టిన సర్వేల్లో వీరెవరూ వివరాలు ఇవ్వకపోవటం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని గ్రామ వార్డు సచివాలయాల శాఖ కార్యదర్శి వెల్లడించారు. కలెక్టర్లు ఈ విషయంపై దృష్టి పెట్టి జనవరి 31 తేదీలోగా వివరాలు సేకరించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా పౌరులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు. నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాతో రాష్ట్రంలోని పౌరుల బ్యాంకు వివరాలు కూడా అనుసంధానించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ జియో ట్యాగింగ్ ద్వారా అనుసంధానించటంతో పాటు ఫొటోలు కూడా తీయాలని స్పష్టం చేసారు. గ్రామాలు, హ్యాబిటేషన్ల వారీగా కుటుంబాల మ్యాపింగ్ కూడా చేయాల్సిందిగా ప్రభుత్వం సూచించింది.

మంత్రి లోకేశ్‌ కృషితో విశాఖలో గూగుల్‌ క్యాంపస్ - రాష్ట్రాభివృద్ధిలో గేమ్ ఛేంజర్ అవుతుంది : సీఎం చంద్రబాబు

నిర్లక్ష్య ధోరణి ఉండకూడదు : భోజన విరామం తర్వాత రాష్ట్రంలో ఫిర్యాదుల స్వీకరణపై కలెక్టర్ల సదస్సులో సమీక్షించారు. గ్రీవెన్స్ పరిష్కారంపై ప్రజెంటేషన్ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ ఇచ్చారు. రాష్ట్రంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చిన ఫిర్యాదుల అన్నిటినీ ఒక్కచోట నమోదు చేస్తున్నామన్నారు. గడిచిన ఆరు నెలలుగా ప్రజల నుంచి 1,29,963 ఫిర్యాదులు ప్రజల నుంచి వచ్చాయన్నారు. 78,700 ఫిర్యాదులు రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయని, 14 వేల 119 ఫిర్యాదులు పోలీసు విభాగానికి చెందినవని, 13,146 మున్సిపల్ శాఖలో ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. అన్ని విభాగాలు 70 శాతం మేర ఫిర్యాదులు పరిష్కరించినట్టు చూపుతున్నాయన్నారు.

ప్రజల నుంచి సంతృప్తి స్థాయి ప్రతి నెలా తగ్గుతూ వస్తోందంటే ప్రజలకు సరైన పరిష్కారం చూపించటం లేదని అర్ధం అవుతోందని మండిపడ్డారు. వారిలో అసంతృప్తి ఎక్కువ అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందన్నారు. కొన్ని ఫిర్యాదులు పరిష్కరించలేనివి కూడా వస్తున్నాయని, ప్రజలకు సమాధానం చెప్పేటప్పుడు నిర్లక్ష్య ధోరణి ఉండకూడదని తెలిపారు. చాలా సమస్యల్ని మానవత్వంతో పరిష్కరించాలని అందరికీ సూచిస్తునన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో నాణ్యత ఉండాలి అదే ప్రామాణికంగా పని చేయాలన్నారు. ఆర్ధిక, ఆర్థికేతర అంశాలుగా వాటిని వేరు చేసి వీలైనంత మేర పరిష్కరించాలన్నారు. అటవీ భూములకు సంబంధించిన విషయాలపై ప్రభుత్వ విభాగాలు కూర్చుని చర్చించి పరిష్కారం చూపించాలని సూచించారు.

సాంకేతికత అందిపుచ్చుకోవాలి - తక్కువ సమయంలోనే ఎక్కువ సేవలు అందించాలి : సీఎం చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.