Young Man Suspicious Death in AP : ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో దారుణం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఉన్న ఎన్టీఆర్ స్టిక్కర్ తొలగించే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడం, కాసేపటికే ఆ ఇద్దరిలో ఓ యువకుడు శవమై కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,
పెనుగంచిప్రోలు తూర్పు బజారు ఎస్సీ కాలనీకి చెందిన యువకుడు మందా కార్తీక్ (19) టీడీపీ సానుభూతిపరుడు. వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన కారె నాగరాజు వైఎస్సార్సీపీ కార్యకర్త. నాగరాజుకు ఓ టాటా ఏస్ వాహనం ఉండగా, కార్తీక్ దానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక పెనుగంచిప్రోలులో నిర్వహించిన తెలుగు దేశం పార్టీ విజయోత్సవ సంబురాల్లో కార్తీక్ పాల్గొన్నాడు.
Vemuru SI Attacked on TDP Activist: టీడీపీ కార్యకర్తపై దాడి.. తలను పోలీసు జీపుకు బాదిన ఎస్సై
సంబురాల అనంతరం అదే రోజు సాయంత్రం తన బైక్‌పై వేమవరం వెళ్లి యజమాని నాగరాజును కలిశాడు. ఆ సమయంలో కార్తీక్ తన ద్విచక్ర వాహనం వెనక అంటించుకున్న ఎన్టీఆర్ స్టిక్కర్‌ను తొలగించాలంటూ నాగరాజు అతడికి హుకూం జారీ చేశాడు. అతడితోనే బలవంతంగా స్టిక్కర్ తొలగింపజేస్తూ వీడియో తీశాడు. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య కాస్త గొడవ జరిగింది. అయినప్పటికీ నాగరాజు అవేవీ పట్టించుకోకుండా కార్తీక్‌తో స్టిక్కర్ తీసివేయించి, ఆ వీడియోను తన వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు.
స్టిక్కర్ తీసేయించిన 2, 3 గంటల్లోనే కార్తీక్ వేమవరం సమీపంలో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటి వరకు ఆనందంగా గడిపిన తమ కుమారుడు, అంతలోనే విగతజీవిగా మారడం చూసి గుండెలవిసేలా రోదించారు. మృతదేహంపై బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. అవి కిందపడితే తగిలినవి కావని, ఎవరో బలంగా కొట్టి హతమార్చారని మృతుడి తండ్రి మందా బెనర్జీ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వత్సవాయి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. నాగరాజుతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
'మంత్రి పైనే ఆరోపణలు చేస్తావా'.. టీడీపీ కార్యకర్తపై దాడి.. పవర్ కట్ చేసిన పోలీసులు