Supreme Court Stayed on MLC Dande Vital Election Case : భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ దండె విఠల్‌కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే విధించింది. పిటిషన్‌పై తదుపరి విచారణ జులై నెలకు వాయిదా వేసింది. ఎమ్మెల్సీగా విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు. అయితే, తాను నామినేషన్ ఉపసంహరించుకోలేదని, తన సంతకాలు ఫోర్జరీ చేశారని కాంగ్రెస్ పార్టీ నేత పాతిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. విఠల్ ఎన్నిక చెల్లదంటూ ప్రకటించాలని కోర్టును కోరారు. ఫోర్జరీని తేల్చేందుకు నామినేషన్ డాక్యుమెంట్లను కేంద్ర ఫోరెన్సిక్ లేబొరేటరికీ పంపించాలని విన్నవించారు. అనంతరం దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న తెలంగాణ ఉన్నత న్యాయస్థానం, విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించింది. తాజాగా ఇదే కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో దండె విఠల్‌కు ఊరట లభించింది.
ఇంతకీ ఏమి జరిగందంటే : ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం 2021 నవంబరు 16న నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ అదే నెల 23 వరకు నామపత్రాలను స్వీకరించింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దండె విఠల్, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, పెందూర్ పుష్పరాణి సహా 30 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు నామపత్రాలు దాఖలు చేశారు.
ఉపసంహరణకు చివరి రోజైన 2021 నవంబరు 26న 27 మంది స్వతంత్రులు నామపత్రాలను ఉపసంహరించుకోగా దండె విఠల్, పెందూర్ పుష్పరాణి, పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి బరిలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అదేరోజు చివరి క్షణంలో పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తరఫున నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలాధ్యక్షుడు సింగార్ కిషన్ నామపత్రాన్ని ఉపసంహరించుకోవడం ఒక్కసారిగా కలకలం రేకెత్తించింది. దాంతో దండె విఠల్, పెందూర్ పుష్పరాణి బరిలో ఉన్నారని అప్పటి రిటర్నింగ్ అధికారి(ఆర్‌వో) తేల్చటం పొలిటికల్‌గా వివాదాస్పదమైంది.
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే : ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకోలేదని, అకారణంగా తప్పించారని, నామినేషన్ల ఉపసంహరణను ఆమోదించే ముందు నిబంధనల ప్రకారం ఆర్‌వో తన అభిప్రాయాన్ని అడగలేదని పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి అదే రోజు చెప్పారు. పైగా తన తరఫున ఫోర్జరీ సంతకంతో నామపత్రాన్ని ఉపసంహరించుకున్నారని ప్రకటించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. దాంతో పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి ఎన్నిక నిర్వహణపై స్టే విధించాలని కోరగా కోర్టు అందుకు అనుమతించలేదు.
కాగా అభ్యంతరాలుంటే తరువాత చూసుకోవాలని సూచించింది. ఆర్‌వో నిర్ణయం ఆధారంగా ఎన్నికల కమిషన్ 2021 డిసెంబరు 10న ఎన్నిక నిర్వహించి అదే నెల 14న బీఆర్ఎస్ అభ్యర్థి దండె విఠల్ విజయం సాధించినట్లు ప్రకటించటం సంచలనమైంది. దండె విఠల్ ఎన్నికైన తర్వాత రాజేశ్వర్‌రెడ్డి మళ్లీ ధర్మాసనాన్ని ఆశ్రయించటంతో ఎన్నిక చెల్లదంటూ ఈనెల మొదటి వారంలో హైకోర్టు తీర్పు ఇవ్వటం గమనార్హం.
MLC Dande Vital: 'ఎమ్మెల్సీ అంటే ఇలా ఉండాలి అనేలా మెప్పుపొందుతా'