Supreme Court Orders on Sand Mining in AP: రాష్ట్రంలో ఇసుక మైనింగ్‌పై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధంచేయాలని నిర్దేశించింది. ఈ-మెయిల్, టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచాలని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశాలిచ్చింది.
అవినీతి బ్రదర్స్ - ఇసుక, మట్టి తవ్వకాలు, రవాణాలో వారిదే పెత్తనం ! - YSRCP Leaders Irregularities
ఇసుక తవ్వకాలపై కేంద్ర పర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలని, రాష్ట్ర అధికారులకు ఈ సమాచారం ఇవ్వనవసరం లేదని స్పష్టంచేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తే చర్యలకు వెనుకాడవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశాన్ని తప్పక పాటించాలంది. సుప్రీంకోర్టు చెప్పాక కూడా యంత్రాలు వాడారని కేంద్ర పర్యావరణశాఖ చెప్పగా అధికారులు గుర్తించిన మైనింగ్ ప్రదేశాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని నిర్దేశించింది.
నదులపై వైఎస్సార్సీపీ ఇసుక తోడేళ్లు - అభివృద్ధి పనులకు కొరత - YSRCP Leaders Illegal Sand Mining
మైనింగ్ జరిగిన ప్రదేశాలను కలెక్టర్లు తనిఖీ చేయాలని, ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఆదేశాల అమలుపై జులై 9లోపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కారు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఇసుక మైనింగ్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జులై 15కు వాయిదా వేసింది.
కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు- ప్రొక్లైన్లతో నదీగర్భానికి తూట్లు - Illegal Sand Mining