SC Notices to Viveka Case Accused Sivashankar Reddy: వివేకా హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీత ఇచ్చిన పిటిషన్ అంశంలో శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
వివేకా హత్య అవినాష్‌రెడ్డి డైరక్షన్లో జరిగిందని చెప్పకనే చెప్పారు: బీటెక్ రవి - BTech Ravi on YS Avinash Reddyమాజీ మంత్రి వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్ కు తెలంగాణ హైకోర్టు మార్చి 11న బెయిల్ మంజూరు చేసింది.
వివేకా హత్యతో సంబంధం లేదని అవినాష్ అప్పుడే చెప్పొచ్చు కదా: షర్మిల - YS Sharmila on MP Avinash Reddy
కేసు విచారణ సమయంలో ఏపీకి వెళ్లకూడదని షరతు విధించింది. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. బెయిల్ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. దీనిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. జులై 22 నుంచి ప్రారంభమయ్యే వారంలో లిస్ట్ చేయాలని ఆదేశించింది. శివశంకర్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్ కు తెలంగాణ హైకోర్టు మార్చి 11న బెయిల్ మంజూరు చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. బెయిల్ రద్దు చేయాలని కోరారు. సునీత పిటిషన్ అంశంలో శివశంకర్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.
ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి వేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు గతంలో విచారణ జరిపింది. దస్తగిరి పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేయగా కోర్టు షరతులు ఉల్లంఘించినందున బెయిల్ రద్దు చేయాలని దస్తగిరి పిటిషన్లో పేర్కొన్నారు. అవినాష్ రెడ్డి తన కుటుంబ సభ్యులను వేధిస్తున్నారని, తనకు రూ.20 కోట్లు ఆశచూపి ప్రలోభ పెట్టేందుకు యత్నిస్తున్నారని దస్తగిరి తెలిపారు.
అవినాష్ బెయిల్ పిటిషన్‌ను ఉద్దేశించి దస్తగిరి వాదనను సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అని సీబీఐని హైకోర్టు అడగడంతో తాము సమర్థిస్తున్నామని సీబీఐ తెలిపింది. బెయిల్ రద్దుకు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదని హైకోర్టు సీబీఐని ప్రశ్నించగా తమ కన్నా ముందే సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారని వివరించింది. ఆ పిటిషన్ విచారణలోనే తమ వాదన వినిపిస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు.