Anantapur Bar Council Workshop: అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో యువ న్యాయవాదన సదస్సు జరిగింది. అనంతపురం బార్ కౌన్సిల్ (Anantapur Bar Council) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వర్క్ షాప్‌కు ముఖ్యఅతిథులుగా సుప్రీంకోర్ట్ న్యాయమూర్తులు జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎస్.వి.ఎన్ భట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన న్యాయమూర్తులు యువ న్యాయవాదులకు పలు సూచనలు చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎలా అదిగమించాలనే అంశంపై వారికి హితబోధ చేశారు.
అప్పుడే వారికి న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం కలుగుతుంది: న్యాయవ్యవస్థ మీద నమ్మకాన్ని పెంచే విధంగా యువ న్యాయవాదులు భవిష్యత్ లో అడుగులు వేయాలని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా స్పష్టం చేశారు. న్యాయమూర్తులు, యువ న్యాయవాదులకు వృత్తిలో ఎదుర్యయే సవాళ్ల గురించి పలు చూచనలు చేశారు. జస్టిస్ అషానుద్దీన్ అమానుల్లా (Justice Ahsanuddin Amanullah) మాట్లాడుతూ మనం ఏదైనా కేసు తీసుకున్న దానిని పూర్తిగా నమ్మినప్పుడే తీసుకోవాలన్నారు. ముందే మనం ఏది నిజం, ఏది అబద్ధం అని తెలుసుకున్న తర్వాత న్యాయం వైపు నిలబడేలా ఉండాలన్నారు. దేశంలో ఎన్నో న్యాయకళాశాలలు ఉన్నాయని, అయినప్పటికీ ఇంకా చాలా కొరత కనిపిస్తూనే ఉందన్నారు. మనం బాధితులకు ఎప్పుడైతే న్యాయం చేస్తామో అప్పుడే వారికి న్యాయ వ్యవస్థ మీద మరింత నమ్మకం కలుగుతుందన్నారు. వృత్తిలో మనకు ఎదురయ్యే సవాళ్ళతో కొన్నిసార్లు మన కుటుంబాలతో వెచ్చించే సమయం ఉండదన్నారు. న్యాయవాద వృత్తిని సవాల్ గా తీసుకొని పనిచేసినప్పుడే కక్షిదారులకు న్యాయం చేయగలుగుతామన్నారు. విలువలు, విశ్వసనీయతతో న్యాయవాద వృత్తిని కొనసాగించాలని సూచించారు.
బీజేపీ నేత హత్య కేసులో సంచలన తీర్పు- 15 మందికి మరణ శిక్ష
కోర్టు కేసుల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ వినియోగం: తను ఈ రంగాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఈ వృత్తితో ఒత్తిడి ఉంటుందని, అలాంటి ఒత్తిడిని తట్టుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కోర్టులో జరిగే వాదనల విషయంలో న్యాయవాదులకు పూర్తిగా అవగాహన ఉండాలని సూచించారు. రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ (Artificial Intelligence) ఉపయోగం ద్వారా కోర్టు కేసులను వాదించే అవకాశాలు వస్తాయని తెలిపారు. కొన్ని కేసుల్లో ఇబ్బుదులు ఎదురవుతాయని అలాంటి ఇబ్బందులను అదిగమిస్తూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. పేదలు, అభాగ్యుల పట్ల సానుకులంగా వ్యవహరించాలని తెలిపారు. బార్ కౌన్సిల్ ద్వారా ఇలాంటి సమావేశాలు నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు కాబోయే న్యాయవాదులకు సూచనలు చేశారు.
'ఆస్తులు అమ్మేసి ఎవర్‌గ్రాండ్‌ను మూసేయండి'- హాంకాంగ్ కోర్టు తీర్పు