Supreme Court Hearing on CM Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల కేసుపై సుప్రీం కోర్టు జరిపింది. ఈ క్రమంలో ట్రయల్ ఎందుకు జాప్యం అవుతుందో కారణాలు చెప్పాలని సీబీఐని ఆదేశించింది. నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం విచారణను వాయిదా వేశారు. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా ఆలస్యమవుతోందని సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ట్రయల్ సవ్యంగానే జరుగుతోందని ధర్మాసనానికి సీబీఐ తెలిపింది. సవ్యంగా జరుగుతుందని చెప్పడం కాదు అఫిడవిట్ ఎందుకు ఫైల్ చేయలేదో చెప్పాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు.
CM Jagan Illegal Assets Case: ముఖ్యమంత్రి అన్న కారణంగానే ట్రయల్ ఆలస్యం అవుతోందనేది ప్రధాన ఆరోపణ దానికి ఏం సమాధానం చెపుతారని కోర్టు నిలిదీసింది. సీఎం అయితే వ్యక్తిగత హాజరు నుంచి ఎందుకు మినహాయింపు అడుగుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. ట్రయల్ సుధీర్ఘంగా సాగుతుంటే వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇలాంటి విషయాల్లో విచారణ జరుపుతున్న కోర్టులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రయల్ వేగంగా జరపాలని ఆదేశించారు. బెయిల్ రద్దు, హైదరాబాద్ నుంచి ట్రయల్ మరో రాష్ట్రానికి బదిలీ పిటిషన్లను కలిపే విచారణ చేపడుతామని సుప్రీం ధర్మసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఆగస్టు 5 నుంచి ప్రారంభమయ్యే వారానికి వాయిదా వేసింది.
Jagan Illegal Cases Investigation in CBI Court: సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసులపై విచారణ జరిగింది. జగన్, ఇతర నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై న్యాయస్థానంలో వాదనలు జరిగాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో (CBI Cases on CM Jagan) డిశ్చార్జి పిటిషన్లపై తదుపరి విచారణను ఈనెల 18 కి కోర్టు వాయిదా వేసింది.