ETV Bharat / state

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు భారీ ఊరట - SC ON VOTE FOR NOTE CASE - SC ON VOTE FOR NOTE CASE

Chandrababu Vote For Note Case Update : ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఊరట లభించింది. ఈ కేసులో వైఎస్సార్​సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. రాజకీయ కక్షలుంటే బయట చూసుకోవాలని కోర్టులను వేదికగా చేసుకోవద్దని ధర్మాసనం హెచ్చరించింది.

SC ON VOTE FOR NOTE CASE
Chandrababu Vote For Note Case Update (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 21, 2024, 2:56 PM IST

Updated : Aug 21, 2024, 5:09 PM IST

Supreme Court Dismissed Petitions of Alla Ramakrishna Reddy : ఓటుకు నోటు కేసులో వైఎస్సార్​సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. ఈ కేసులో ఇప్పటికే రెండు ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు లేవని పేర్కొంటూ రెండు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.

ఈ కేసులో భిన్న వాదనల సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టులను వేదిక చేసుకోవద్దని పిటిషనర్‌ను హెచ్చరించింది. ఆధార రహిత అంశాలను తీసుకొచ్చి కోర్టుతో ఆటలాడుకోవద్దని తీవ్ర వాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు రాజకీయాలతో ఉన్న అనుబంధంపై ఆరా తీసింది. పిటిషనర్‌ 2014 నుంచి ఇటీవల ఎన్నికల వరకు ఎమ్మెల్యేగా ఉన్నారని చంద్రబాబు తరఫు న్యాయవాదులు తెలిపారు. రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీచేసి గెలవాలని ఆళ్లకు ధర్మాసనం హితవు పలికింది.

Vote for Note Case Update : ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ప్రతిపక్షంలో ఉందని, పిటిషన్‌ దాఖలు చేసిన సమయంలో కూడా ప్రతిపక్షంలోనే ఉందని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వివరించారు. కావాలంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ధర్మాసనం సూచించింది. ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో వేరే కేసులు కూడా ఉన్నాయని రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది జాబితా ఇచ్చారు. ఆ కేసులకు, ఇప్పుడు వాదనలు జరుగుతున్న కేసులకు సంబంధం లేదని లూథ్రా తెలిపారు. కేసుల జాబితా చూశాక పిటిషనర్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి అంశాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది.

అన్న క్యాంటీన్లను ప్రారంభించిన ఏపీ సీఎం - పేదలతో కలిసి చంద్రబాబు దంపతుల భోజనం - AP CM Inaugurated Anna Canteen

చంద్రబాబు గెలవగానే మీకు కొవ్వు పెరిగిందా? - మహిళలతో హెడ్​కానిస్టేబుల్​ అనుచిత ప్రవర్తన - ANDHRAPRADESH LATEST CRIME NEWS

Last Updated : Aug 21, 2024, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.