Summer Heat Waves in Andhra pradesh: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉదయం 10 గంటలు అయితే చాలు ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వడగాలుల తీవ్రత కూడా పెరిగింది. దీంతో వృద్ధులు, పిల్లలు వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యాహ్నం అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో సమయంలో బయటకు వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.
ఏపీలో భానుడి భగభగలు- 268 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు - High Temperature in AP
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కడప జిల్లా సింహాద్రిపురంలో 45.6, నంద్యాల జిల్లా బనగానపల్లె, ప్రకాశం జిల్లా మేకలవారిపల్లిలో 45.5 డిగ్రీలు నమోదయ్యింది. విజయనగరం జిల్లా రామభద్రాపురంలో 44.9, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 44.5, చిత్తూరు జిల్లా పిపల్లిలో 44.4, నెల్లూరు జిల్లా తేగచెర్ల, శ్రీకాకుళం జిల్లా కొవిలంలో 44.2, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయినట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా 61 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 117 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు వాతావారణ శాఖ పేర్కొంది.
మండుతున్న ఎండలు - మరింత పెరిగే అవకాశం - summer heat in andhra pradesh
Officials Advise People to Take Precautions: ప్రజలు ఎండలో బయటికి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వడగాడ్పుల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సెల్ఫోన్లకు హెచ్చరికలు పంపాలని అధికారులు నిర్ణయించారు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులపై ఎప్పటికప్పుడు స్టేట్ ఏమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది గరిష్ఠంగా 48.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దాఖలాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత వల్ల సుదూర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మండుతున్న ఎండలకు తోడు పలు చోట్ల విద్యుత్తు అంతరాయం కలగటంతో జనం ఉక్కపోతకు గురవుతున్నారు.
రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు - ఈ మండలాల్లో వడగాలులు - AP TEMPERATURE
ఏపీలో గురువారం ఉష్ణోగ్రతలు: నిన్న పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 45.8°C డిగ్రిల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సుమారుగా 44 °C డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.