Summer Camps in Hyderabad 2024 : సమ్మర్ హాలిడేస్.. పిల్లలు ఎంజాయ్ చేయడానికి మంచి అవకాశం. అయితే.. నిజానికి పుస్తకాలు పక్కన విసిరికొట్టి గ్రౌండ్లో దుమ్ము లేపాల్సి ఉంటుంది. కానీ.. విజృంభిస్తున్న ఎండలతో ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. ఇక, పిల్లలు ఇంట్లో ఉన్నారంటే అరాచకం సృష్టిస్తారు. అంతేనా..? రోజంతా మొబైల్ ఫోన్లో మునిగిపోతారు. లేదంటే.. టీవీకి అతుక్కుపోతారు. దీర్ఘకాలంలో ఇది వారి మానసిక ఆరోగ్యానికి, కంటి చూపునకూ మంచిది కాదు. అందుకే.. పేరెంట్స్ సమ్మర్ క్యాంప్స్ వైపు చూస్తుంటారు.
పిల్లలు ఇలా సమ్మర్‌లో ఏదైనా క్యాంప్‌లో చేరితే.. ఆటలు, పాటలు, యోగా, ధ్యానం వంటివి నేర్చుకుంటారు. వీటివల్ల వారు శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారని నిపుణులు సూచిస్తున్నారు. మరి, మీరు కూడా మీ పిల్లలను ఏదైనా సమ్మర్‌లో క్యాంప్‌కు పంపించాలనుకుంటున్నారా? అయితే.. హైదరాబాద్ నగరంలో కొన్ని సంస్థలు పిల్లలకు వేసవి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రామకృష్ణ మఠం :
యోగా, ధ్యానం, వ్యక్తిత్వ వికాసం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పిల్లలు పెంపొందించుకునే విధంగా రామకృష్ణ మఠం ఈ సమ్మర్‌లో క్యాంప్ నిర్వహిస్తోంది. ఇందులో పిల్లలకు స్వామిజీలతో శిక్షణ ఇవ్వనున్నారు. రామకృష్ణ మఠం "వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్" (వీఐహెచ్ఈ ) సంస్కార్ - 2024 పేరుతో 4వ తరగతి నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తుంది. 4-7 తరగతి చదివే విద్యార్థులకు జరిగే శిక్షణా శిబిరం ఏప్రిల్ 29న ప్రారంభమై మే 10న ముగుస్తుంది. పిల్లలకు 12 రోజుల పాటు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు క్లాసులు జరగనున్నాయి.
అలాగే 8-10 తరగతి విద్యార్థులకు మే 14 నుంచి మే 25 వరకు క్లాసులు జరగనున్నాయి. వారికి కూడా క్లాసులు 12 రోజుల పాటు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరుగుతాయి. వెబ్‌సైట్‌లో సంబంధిత కోర్స్‌కు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వీఐహెచ్‌ఈ చెప్పింది. ఏప్రిల్ 28న ఈ క్యాంప్ ప్రారంభ కార్యక్రమం జరగనుంది. మరిన్ని వివరాలకు whatsapp నంబర్ 9177232696 లో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద తెలిపారు.
ఉస్మానియా యూనివర్సిటీలో :
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో సమ్మర్ క్యాంపులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ పిల్లలకు 45 రోజులపాటు వివిధ క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. కాబట్టి.. సిటీలో ఉన్న తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలకు ఏదైనా ఆటలలో శిక్షణను అందించాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం.
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ఉచిత క్రికెట్ కోచింగ్ :
హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 20వ తేదీ వరకు 30 రోజుల పాటు ఉచిత క్రికెట్ శిక్షణ ఇవ్వనున్నారు. హైదరాబాద్ నగరంతోపాటు ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన క్యాంప్స్ నిర్వహిస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్‌మోహన్ రావు తెలిపారు. ప్రతి జిల్లాలో మూడు చోట్ల వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. కాబట్టి, క్రికెట్ నేర్చుకోవాలనుకునే పిల్లలకు ఇది ఒక మంచి అవకాశం!
హైదరాబాద్‌లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం - రహదారులన్నీ జలమయం - Hyderabad Rains Today
అన్నమయ్య జిల్లాలో విషాదం - ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య - MOTHER SUICIDE WITH 3 KIDS IN AP